వ్యాక్సినేషన్ సర్వేలో సంచలన నిజాలు..

  0
  39

  కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలంటే ఇప్పటికీ కొంతమందికి భయంగానే ఉంది. దానికి కారణం, వ్యాక్సిన్ ప్రారంభంలో వ్యాక్సిన్ వేసుకుంటే రక్తం గడ్డకడుతుందని, తద్వారా తీవ్ర పరిణామాలు సంభవిస్తాయన్న వార్తల నేపథ్యంలో మొదట్లో వ్యాక్సిన్ పట్ల మెజార్టీ ప్రజలు మొగ్గు చూపలేదు. అయితే కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత దుష్పరిణామాలు ప్రపంచంలో అనేక చోట్ల సంభవించిన మాట వాస్తవమే. భారత దేశంలో ఈ వ్యాక్సిన్ వేయడం మొదలైన తర్వాత ప్రభుత్వం నేషనల్ అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ కమిటీ అనే ఓ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ వ్యాక్సిన్ వల్ల కలిగే దుష్పరిణామాలపై అధ్యయనం చేసింది.

  ఈ అధ్యయనంలో ప్రధానంగా తేలింది యూరోపియన్ దేశాలకంటే ఆసియా దేశాల ప్రజలకు ఈ వ్యాక్సిన్ వల్ల తక్కువ దుష్పరిణామాలు వచ్చాయని తేలింది. కొవిషీల్డ్, కొవాక్సిన్.. ఈ రెండు వ్యాక్సిన్లలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ లోనే కొన్ని కేసుల్లో రక్తం గడ్డకట్టడం కనిపించింది. దేశవ్యాప్తంగా గత సోమవారం నాటికి 23వేల వ్యాక్సినేషన్ కేసుల్లో కొన్ని ఇబ్బందులు కనిపించాయి. వాటిల్లో 700 కేసులు సీరియస్ గా పరిగణించారు. మళ్లీ సమగ్ర పరిశీలన జరిపితే 498మందికి తీవ్రమైన దుష్పరిణామాలు తలెత్తగా వారిలో కూడా 26మందికి రక్తం గడ్డకట్టే సమస్య ఎక్కువగా ఉంది.

  మిగిలినవారికి మందులతో నయం చేసే పరిస్థితుల్లో ఉంది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ విషయంలో 10లక్షల డోసులు 0.61 కేసుల్లోనే ఈ పరిస్థితి కనిపించింది. కొవాక్సిన్ విషయంలో ఈ పరిస్థితి లేదు. ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పై మొదట్నుంచి ఈ ప్రచారం ఉండటంతో కొవిషీల్డ్ పై సమగ్ర దర్యాప్తు అవసరమైంది. వ్యాక్సిన్ వేసిన తర్వాత వచ్చే రక్తం గడ్డకట్టే సమస్య, భారత దేశంలో దాదాపుగా నిర్లక్ష్యం చేయగల స్థాయిలోనే ఉందని, బ్రిటన్, జర్మనీ కంటే 10లక్షలకు 4 కేసులు మాత్రమే తక్కువగా ఉందని తెలిపారు.

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.