సెకండ్ వైఫ్ రెస్టారెంట్.. ఏమిటా రహస్యం.. ?

  0
  888

  సెకండ్ వైఫ్ రెస్టారెంట్… ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఈ రెస్టారెంట్ పేరే వినిపిస్తోంది. విదేశాల నుంచి స్వదేశానికి ఈ రెస్టారెంట్ పేరు వ్యాపించింది. ఇందులో ప్ర‌త్యేక‌త ఏమిటో తెలియ‌దు గానీ.. రెస్టారెంట్ పేరు మాత్రం బాగా పాపుల‌ర్ అయింది. సెకండ్ వైఫ్ రెస్టారెంట్‌ను ఫ‌స్ట్ టైమ్ పాకిస్తాన్ లోని క‌రాచీలో ప్రారంభించారు.

  ఫుడ్ సంగ‌తి ఎలా ఉన్నా… రెస్టారెంట్ పేరుకే అక్క‌డి జ‌నాలు, భోజ‌న‌ప్రియులు ప‌డిపోయారు. ఇంటి భోజ‌నం కంటే.. రెస్టారెంట్ ఫుడ్‌పైనే ఎక్కువ మోజు పడ్డారు. అందుకే అక్క‌డ ఈ రెస్టారెంట్ బాగా క్లిక్ అయింది. ఆ రెస్టారెంట్ నేమ్ ట్రెండింగ్ అయిపోయింది. ఇంకేముంది.. వ‌ర‌స‌గా ఈ పేరుతో ఇత‌ర ప్రాంతాల్లో కూడా రెస్టారెంట్లు వెలిసాయి. పాక్ నుంచి ఇత‌ర దేశాల్లోనూ ఈ రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. అదికాస్తా.. ఇండియాకి పాకింది.

  ఎప్పుడైతే ఇండియాకి సెకండ్ వైఫ్ రెస్టారెంట్ అడుపెట్టిందో… గిరాకీ బాగా పెరిగింది. భోజ‌న‌ప్రియులు క్యూలు క‌ట్టారు. బిజినెస్ బాగా ర‌న్ కావ‌డంతో.. దేశ‌వ్యాప్తంగా ప్ర‌తి రాష్ట్రంలో, ప్ర‌తి జిల్లాలో సెకండ్ వైఫ్ రెస్టారెంట్ల బోర్డులు వెలిశాయి.

  ఇంట్లో భార్య వండిన భోజ‌నం కంటే… సెకండ్ వైఫ్ రెస్టారెంట్లో ఫుడ్ కోసం ఎగ‌బ‌డుతున్నారు. ఇక జ‌నాలు కూడా మొద‌టి భార్య భోజ‌నం వ‌ద్దు… రెండో భార్య ఫుడ్డే ముద్దు అనే ధోర‌ణిలో భోజ‌న‌ప్రియులు భావిస్తున్నారు. రెస్టారెంట్లే కాదు.. క‌ర్రీ పాయింట్లు కూడా వ‌చ్చేసాయంటే.. సెకండ్ వైఫ్ మ‌హ‌త్యం ఏమిటో !

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.