ఆవుపేడతో స్నానంతో కరోనా పోతుందా..?

  0
  282

  భారతదేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విలయం తాండవం చేస్తోంది. ఆస్పత‍్రుల్లో బెడ్లు లేక, ఆక్సిజన్‌ కొరత కారణంగా ఇప్పటి వరకు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకెంతో మంది ప్రాణాల కోసం పోరాడుతున్నారు. క‌రోనాను అంత‌మొందించే స‌రైన వ్యాక్సిన్ కూడా ఇంత‌వ‌ర‌కు రాలేదు. కొన్ని రకాల వ్యాక్సిన్లు వచ్చినా ఇంకా అందరికీ అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో చాలా మంది గోమూత్రం, గోమ‌యంతో కరోనాకి చెక్ పెట్ట‌వ‌చ్చ‌నే అపోహ‌తో ఉన్నారు. వీటి ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని గోశాలలకు క్యూ కడుతున్నారు. గుజ‌రాత్ ప్ర‌జ‌ల్లో ఇది బ‌లంగా నాటుకుపోయింది. ఎంత‌లా అంటే చ‌దువుకున్న వారు కూడా దీన్ని గుడ్డిగా న‌మ్మేస్తూ ఆవుపేడ‌, ఆవు మూత్రంతో థెర‌పీ చేయించుకుంటున్నారు.

   

   

   

  గుజ‌రాత్ రాష్ట్రం అహ్మ‌దాబాద్ లోని శ్రీస్వామినారాయ‌ణ్ గురుకుల్ విశ్వ‌విద్యా ప్రతిష్టాన్ లో ఆవు పేడ, ఆవుమూత్రాన్ని ఒంటి నిండా పూసుకొంటున్నారు. బాగా ఎండిపోయిన తర్వాత నీళ్ళు, పాలతో కడుక్కుంటున్నారు. ఇలా వారానికి కనీసం ఒక రోజైనా చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా కరోనా రాకుండా కాపాడుకోవచ్చని వారు బలంగా న‌మ్ముతున్నారు. అయితే దీనిపై ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్ డాక్ట‌ర్ మావ్ లంకర్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఆవు పేడను శరీరానికి పూసుకుంటే, ఆవు మూత్రంతో ఒళ్ళంతా రుద్దుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందనేది కేవ‌లం అపోహ మాత్ర‌మేన‌ని అన్నారు.

   

  దీనివ‌ల్ల కరోనా నుంచి రక్షణ లభించదని తేల్చి చెబుతున్నారు. వీటికి ఎలాంటి శాస్త్రీయ‌త లేద‌న్నారు. పేడను ఒంటికి పట్టించడం మూలంగా బ్లాక్‌ ఫంగస్ వ‌చ్చే ప్ర‌మాద‌ముంద‌ని, అలాగే చ‌ర్మ సంబంధిత వ్యాధులు సోకే అవ‌కాశ‌ముంద‌న్నారు. అదే స‌మ‌యంలో క‌రోనా వైర‌స్ బారిన ప‌డితే, మ‌రింత ప్ర‌మాదం సంభ‌వించే అవ‌కాశ‌ముంద‌న్నారు. ఇలాంటి అశాస్త్రీయ‌మైన ప‌ద్ద‌తులు, చికిత్స‌లకు స్వ‌స్తి చెప్పాల‌న్నారు. క‌రోనా వైర‌స్ ల‌క్షణాలు ఉంటే వెంట‌నే వైద్యులను సంప్ర‌దించాల‌ని సూచించారు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.