సమంత మాజీ లవర్ సంచలన మాట.. ఎవరు ఛీటర్ ..?

    0
    4310

    సమంత, నాగచైతన్య విడాకుల విషయం టాలీవుడ్‌లోనే కాదు సౌత్‌ సినీ ఇండస్ట్రీలోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. వీరి డైవర్స్ పై సినీ వర్గాలు అవాక్కవుతున్నాయి. అక్కినేని ఫ్యాన్స్, సమంత ఫ్యాన్స్ షాక్‌లోకి వెళ్లిపోయారు. ఇక వీరి విడాకులపై పలువురు సెలబ్రీటీలు స్పందిస్తున్నారు. తాజాగా సమంత మాజీ ప్రియుడు సిద్ధార్థ్ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ‘పాఠ‌శాల‌లో మా టీచర్ నేర్పిన తొలిపాఠం ఇది.. మోసం చేసేవారు ఎప్పుడూ బాగుపడరు. ఎప్పటికీ అభివృద్ధి చెందలేరు. ఇదే నేను నా స్కూల్ లో నేర్చుకున్న పాఠం. మీరు మీ స్కూల్లో ఏం నేర్చుకున్నారు?” అని ట్వీట్ చేశారు.

    సిద్దు ఇలాంటి ట్వీట్ చేయ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. గతంలో సిద్ధార్థ్-సమంత డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి చెన్నైలోనే ఉన్నారు. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు కూడా చేశారు. ఇక వీరిద్దరూ కలిసి పెళ్లి చేసుకోవడం ఖాయం అని భావిస్తుండ‌గా, అనూహ్య పరిస్థితుల్లో వీరు విడిపోయారు. త‌ద‌నంత‌రం సామ్-చైతూ ప్రేమించుకోవ‌డం… పెళ్ళి చేసుకోవ‌డం జ‌రిగింది.

    చైతూతో జీవితం సాఫీగా సాగిపోతున్న ఈ తరుణంలో.. తన మాజీ ప్రియుడు సిద్ధార్ధ్ గురించి .. ఓ ఇంట‌ర్వూలో సామ్ ప్ర‌స్తావించింది. త‌న జీవితం కూడా సావిత్రి జీవితంలా ఉండేది. ఆమెకు ఏ విధమైన కష్టాలు క‌లిగాయో.. నా జీవితంలో కూడా అలాంటివే చోటు చేసుకున్నాయంది. అయితే ముందుగానే నేను అలాంటివి పసిగట్టడంతో జాగ్రత్త పడ్డానంది. కాబట్టే నా జీవితం ఇపుడు సాఫీగా సాగిపోతుందంటూ చెప్పుకొచ్చింది. అప్ప‌ట్లో సిద్దూ గురించే సామ్ ఈ వ్యాఖ్య‌లు చేసింద‌ని సినీప్రియులు అనుకున్నారు. ఇక ఇప్పుడు కూడా చైతూకి దూర‌మైన‌ప్పుడు తాను ముంబైకి మ‌కాం మారుస్తున్నానంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై స్పందిస్తూ, తాను అంత పిరికిదాన్ని కాద‌ని, హైద‌రాబాద్ లోనే ఉంటాన‌ని చెప్పుకొచ్చింది.

    అయితే నాలుగేళ్ళ వైవిహిక జీవితంలో చైతూ,సామ్ ల మధ్య విభేదాలు ఏర్పడడంతో ఒకరికొకరు దూరమయ్యారు. విడాకులు కూడా తీసుకోబోతున్నారు. తాజాగా ఈ అంశాన్నిటార్గెట్ చేస్తూ సిద్ధార్థ్ .. ‘పాఠ‌శాల‌లో మా టీచర్ నేర్పిన తొలిపాఠం ఇది.. మోసం చేసేవారు ఎప్పుడూ బాగుపడరు. ఎప్పటికీ అభివృద్ధి చెందలేరు. ఇదే నేను నా స్కూల్ లో నేర్చుకున్న పాఠం. మీరు మీ స్కూల్లో ఏం నేర్చుకున్నారు?” అని ట్వీట్ చేయ‌డం హాట్ టాపిక్ అయింది. స‌మంత‌పై సిద్దూ ప‌రోక్షంగా కామెంట్ చేసిన‌ట్లు అర్ధ‌మ‌వుతోంది.

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.