రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య మృతి..

  0
  78

  ఆనందయ్య మందు తీసుకున్న తర్వాత తనకు ఆరోగ్యంగా ఉందని చెప్పి, ఆ తర్వాత కొన్ని రోజులకు తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందతున్న రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య మృతి చెందారు. వారం రోజుల నుంచి నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించారు. కోట మండలం తిన్నెలపూడికి చెందిన కోటయ్య.. ఆనందయ్య మందుతో కోలుకున్నానన్న వీడియోతో వైరల్‌ అయ్యారు. అప్పటి వరకూ తనకు ఆక్సిజన్ సపోర్ట్ అవసరమైందని, ఆనందయ్య మందుతో కోలుకున్నానని, ఆక్సిజన్ లేకుండా కూడా ఉండగలుగుతున్నానంటూ కోటయ్య మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత రెండు రోజులకు కోటయ్య అస్వస్థతతో తిరిగి ఆస్పత్రికి వచ్చారు. అప్పుడు కూడా మరో వీడియో విడుదల చేశారు. అయితే కోటయ్య ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన కుమారుడు స్పష్టం చేసినట్టు కూడా సమాచారం అందింది. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది. తాజాగా.. కోటయ్య నెల్లూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతిచెందారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..