బిల్ గేట్స్ కాపురంలో ప్రియురాలు చిచ్చు..

  0
  782

  మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడిగానే కాకుండా బిల్-మిలిండా గేట్స్ ఫౌండేషన్‌ ఏర్పాటుచేసి ప్రపంచవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాల ద్వారా విశేష గుర్తింపు పొందిన బిల్ గేట్స్-మిలిండా జంట విడాకులు తీసుకోవడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. 1994లో ప్రేమించి పెళ్ళి చేసుకుని వీరిద్ద‌రూ ఒక ఇంటి వార‌య్యారు. 27 ఏళ్ళ త‌ర్వాత వీరి వైవాహిక బంధానికి తెర‌ప‌డింది. దీనికి కార‌ణం ఏంటి ? ఏమై ఉంటుంది ? అన్న‌ది ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌.
  1994కి ముందు, మిలిండా ప‌రిచ‌యం కాక ముందు బిల్ గేట్స్ అప్ప‌టికే పెద్ద బిగ్ షాట్. అప్ప‌ట్లో ఆయ‌న‌కు యాన్ విన్లాడ్ అనే గ‌ర్ల్ ఫ్రెండ్ ఉండేది. అయితే ఎందుక‌నో వీరిద్ద‌రూ పెళ్ళి మాత్రం చేసుకోలేదు. ఆ త‌ర్వాత మిలిండా, బిల్ గేట్స్ స్థాపించిన మైక్రోసాఫ్ట్ సంస్థ‌లో ఉద్యోగిగా చేర‌డం.. ఆపై ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌ప‌డం.. ప్రేమించుకోవ‌డం.. 1994లో పెళ్ళి చేసుకోవ‌డం జ‌రిగింది. పెళ్ళికి ముందే బిల్ గేట్స్ త‌న మాజీ గ‌ర్ల్ ఫ్రెండ్ గురించి మిలిండా పూస‌గుచ్చి చెప్పార‌ట‌. అంతేకాదు యాన్ విన్లాడ్ తో ప్ర‌తి ఏడాది లాంగ్ వీకెండ్ డేటింగ్ చేస్తాన‌ని అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు. అందుకు ఓకే చెప్పిన త‌ర్వాతే మిలిండా-బిల్ గేట్స్ దంప‌తుల‌య్యారు. ఆ త‌ర్వాత ప్ర‌తి ఏడాదిలో ఒక‌సారి లాంగ్ వీకెంట్ యాన్ విన్లాడ్ తో గ‌డుపుతూ వ‌స్తున్నాడ‌ట బిల్ గేట్స్. అది నేటికీ కొన‌సాగుతోంది. నార్త్ కెరోలినాలో కోజీ బీచ్ వ‌ద్ద ఆమె కోసం కాటేజ్ కూడా క‌ట్టించాడు బిల్ గేట్స్. వీరిద్ద‌రూ అక్క‌డే డేటింగ్ చేస్తుంటారు. అయితే మిలిండాతో చేసుకున్న అగ్రిమెంట్ ను బిల్ గేట్స్ ఉల్లంఘించి, విన్లాడ్ తో ఎక్కువ కాలం డేటింగ్ చేస్తున్నాడ‌ని, అది మిలిండాకు న‌చ్చ‌లేదనే టాక్ హ‌ల్చ‌ల్ చేస్తోంది. బ‌హుశా ఈ కార‌ణ‌మే వీరిద్ద‌రి మ‌ధ్య దూరం పెంచింద‌ని, అందుకే విడాకుల నిర్ణ‌యం తీసుకున్నార‌నే క‌ధ‌నాలు వ‌స్తున్నాయి. మ‌రి అందులో నిజ‌మెంతో తెలియ‌దుగానీ.. పుకార్లు మాత్రం షికార్లు చేస్తున్నాయి.
  ఇదిలావుంటే, బిల్ గేట్స్-మిలిండా జంట విడిపోవ‌డంతో… బిల్ గేట్స్ సోష‌ల్ మీడియాకు విప‌రీత‌మైన రిక్వెస్టులు వ‌స్తున్నాయ‌ట‌. మీవంటి మేధావిని క‌నాల‌ని ఉంది. మీ డీఎన్ఏ కావాలి. మీతో డేటింగ్ చేయాల‌ని వుంది అంటూ ఎంతోమంది నెటిజ‌న్లు బిల్ గేట్స్ కి మెయిల్స్, ట్వీట్లు చేస్తున్నార‌ట‌.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.