ఆస్ట్రా జెనికా వాక్సిన్ తరవాత రియాక్షన్ ఇలా.

  0
  1122

  కోవిడ్ కి వేస్తున్న ఆస్ట్రా జెనికా వ్యాక్సిన్ వేసుకున్న వారం త‌ర్వాత గ్లాస్కోకి చెందిన సారా బ‌క్మ‌న్ అనే మ‌హిళ‌కు కాళ్ళంతా ఎర్ర‌టి పుండ్లు వ‌చ్చాయి. ఆమె మార్చి 18న మొద‌టి డోసు వ్యాక్సిన్ వేయించుకుంది. ఆ త‌ర్వాత సాధార‌ణ‌రీతిలో జ‌లుబు చేసింది. వారం త‌ర్వాత కాళ్ళ‌ల్లో తిమ్మిర్లు వ‌చ్చి మోకాళ్ళ వ‌ర‌కు ఎర్ర‌టి పుండ్లు ప‌డ్డాయి. దీంతో ఆమె క్వీన్ ఎలిజిబెత్ హాస్పిట‌ల్ లో చేరింది. వ్యాక్సిన్ రియాక్ష‌న్ వ‌ల్ల ఇలా జ‌రిగింద‌ని ఆమెను ప‌రీక్షించిన డాక్ట‌ర్లు చెప్పారు. బెక్మ‌న్ మాత్రం అతి కొద్దిమందిలో మాత్ర‌మే ఇలాంటి రియాక్ష‌న్స్ వ‌స్తాయ‌ని, త‌న ప‌రిస్థితి చూసి ఇత‌రులు భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని కోరింది. ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని, క‌రోనా నుంచి ర‌క్ష‌ణ పొందాల‌ని కూడా విజ్ఞ‌ప్తి చేసింది. త‌నకు వ‌చ్చిన రియాక్ష‌న్ అంద‌రికీ రాద‌ని, రియాక్ష‌న్ న‌య‌మ‌వుతుంద‌ని, కోవిడ్ వ‌స్తే న‌యం చేసుకోవ‌డం క‌ష్ట‌మ‌ని చెప్పింది. ఇలాంటి రియాక్ష‌న్ వ‌స్తే వెంట‌నే ఆస్ప‌త్రికి వెళ్ళి టెస్టులు చేయించుకోవాల‌ని సూచించింది. డాక్ట‌ర్లు కూడా ఇలాంటి రియాక్ష‌న్ అరుదుగా వ‌స్తుంద‌ని, ఇది వ్యాక్సిన్ వ‌ల్ల వ‌చ్చిందేన‌ని కూడా నిర్ధారించారు

   

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.