సీఎం జగన్, విష్ణుమూర్తి ఒకరే -రమణ దీక్షితులు

  0
  194

  సీఎం జగన్ ని విష్ణుమూర్తితో పోలుస్తూ వ్యాఖ్యానించారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. ఇటీవలే టీటీడీ తీసుకున్న నిర్ణయంతో ఆయన తిరిగి ప్రధాన అర్చకులుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం సీఎం జగన్ ని కలిశారాయన. అనంతరం మీడియాతో మాట్లాడిన రమణ దీక్షితులు ‘‘ సీఎం జగన్‌ విష్ణుమూర్తిలా ధర్మాన్ని రక్షిస్తున్నారు. అర్చకుల కుటుంబాలకు భూములు ఇవ్వాలని కోరాం. పింక్‌ డైమండ్‌ మాయం అంశం కోర్టులో ఉంది. తిరుమలలో అన్యమత ప్రచారం జరగట్లేదు. టీటీడీ విషయాలను రాజకీయం చేయడం తగదు’’ అని అన్నారు.

  పదవీ విరమణ చేసిన అర్చకులను తిరిగి అదే స్థానంలో విధుల్లోకి తీసుకోవాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకోవడంతో.. రమణదీక్షితులు సహా మరో 14మంది తిరిగి విధుల్లో చేరారు. ఈ నేపథ్యంలో కృతజ్ఞతా పూర్వకంగా సీఎం జగన్ ని కలిశారు రమణ దీక్షితులు.

  ఇవీ చదవండి

  వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

  ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

  టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

  కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ