రాజస్థాన్ కూడా లాక్ డౌన్ లోకి..

  0
  97

  రాజస్థాన్ రాష్ట్రం కూడా లాక్ డౌన్ లోకి వెళ్ళిపోనుంది. ఏకంగా 15 రోజుల పాటు రాజస్థాన్ రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర హోంశాఖ తెలిపింది. ఈరోజు రాత్రి నుండి మే మూడవ తారీఖు వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. రాజస్థాన్ రాష్ట్రంలోకి ప్రవేశించాలనుకునేవారు కూడా నెగిటివ్ రిపోర్టును చూపించాలని ఆదేశాలు జరీ చేసింది. అత్యవసర సర్వీసులు మినహా అన్ని ఆఫీసులు క్లోజ్ చేయాలని స్పష్టం చేసింది.

  నిత్య అవసరాలకు సంబంధించిన షాపులు సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటాయని, కూరగాయలు రాత్రి 7:00 వరకు అమ్ముకోవచ్చని పేర్కొంది. అంతేకాకుండా రాత్రి 8 గంటల వరకు పెట్రోల్ పంపులు బిజినెస్ చేసుకోవచ్చని స్పష్టంచేసింది. తాజా నిర్ణయంతో రాజస్థాన్ రాష్ట్రంలో షాపింగ్ మాల్స్‌, షాపింగ్ కాంప్లెక్స్‌లు, సినిమా హాళ్లు, ఆల‌యాలు సైతం మూత‌ప‌డ‌నున్నాయి. అన్ని విద్యా కేంద్రాలు, కోచింగ్ సెంట‌ర్లు, లైబ్ర‌రీలు కూడా మూత‌ప‌డ‌నున్నాయి.

  గర్భిణీలు ఆసుపత్రులకు వెళ్లేందుకు మాత్రం వెసులుబాటు కల్పించింది. ఇక పెళ్లి మరియు అంత్యక్రియల కార్యక్రమాలకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. అదే రీతిలో వ్యాక్సిన్ వేసుకునే వారికి మాత్రం వెసులుబాటు కల్పించడం జరిగింది.

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.