రజనికి ఛీ ..ఛీ అంటూ డోస్ పడింది..

  0
  57

  త‌మిళ‌ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ర‌జ‌నీ త‌న ఇంట్లో వ్యాక్సిన్ తీసుకోగా, అందుకు సంబంధించిన ఫొటో నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది. ఆ స‌మ‌యంలో చిన్న‌కూతురు సౌంద‌ర్య ఆయ‌న ప‌క్క‌నే ఉన్నారు. అన్నాత్తె సినిమా షూటింగ్ కోసం 35 రోజుల పాటు హైద‌రాబాద్ లో ఉన్న త‌లైవా రీసెంట్‌గా చెన్నైకు వ‌చ్చారు. అయితే ర‌జ‌నీ వ్యాక్సిన్ చేయించుకోవ‌డంలో నిబంధ‌న‌లు అతిక్ర‌మించార‌ని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ఆస్ప‌త్రిలోనే తీసుకోవాల‌ని, వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండాల‌ని, వ్యాక్సిన్ వేయించుకున్న త‌ర్వాత అర‌గంట సేపు ఆస్ప‌త్రిలోనే ఉండాల‌నే నిబంధ‌న‌లు ఉన్నాయి. అయితే ర‌జ‌నీ త‌న ఇంట్లో వ్యాక్సిన్ తీసుకోవ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ కూడా ఆస్ప‌త్రిలోనే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నార‌ని గుర్తు చేస్తూ, ర‌జ‌నీని ట్రోల్ చేస్తున్నారు. అంద‌రికీ ఒక రూల్, ర‌జ‌నీకి మ‌రో రూలా అంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈరోజు హాల్ వ‌ర‌కు వ్యాక్సిన్ వ‌చ్చింది, రేపు బెడ్ రూమ్ వ‌ర‌కు వ‌స్తుంది.. మ‌రుస‌టి రోజు టాయ్ లెట్ వ‌ర‌కు వ్యాక్సిన్ వ‌స్తుంది అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజ‌న్లు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.