వైద్యం ఉంటే బ్రతికేవాడిని చనిపోతున్నా..

  0
  3105

  క‌రోనా మ‌హ‌మ్మారి ఎవ‌రిని, ఎప్పుడు, ఎలా, ఎంత రాక్ష‌సంగా బ‌లి తీసుకుంటుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఎంతోమంది జీవితాలు విషాదాంతంతో ముగిసిపోతున్నాయి. వెబ్ సిరీస్ యాక్ట‌ర్ రాహుల్ వోహ్రా కూడా క‌రోనా కాటుకి బ‌ల‌య్యాడు. మంచి ట్రీట్మెంట్ ల‌భిస్తే తాను త‌ప్ప‌క బ‌తుకుతాను అని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని గంట‌ల‌కే అత‌ను మృత్యువాత ప‌డ‌డం అభిమానుల్ని క‌లిచివేస్తోంది.

   

  కొన్నిరోజుల క్రితం రాహుల్ వోహ్రా క‌రోనాతో ఢిల్లీలోని ఆస్ప‌త్రిలో జాయిన్ అయ్యాడు. ఈ విష‌యాన్ని మే4న ఫ్యాన్స్ కి తెలియ‌జేశాడు. క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, తాను కోలుకోలేక పోతున్నాన‌ని, ఆక్సీజ‌న్ స్థాయిలు ప‌డిపోతున్నాయ‌ని చెప్పాడు. త‌న కుటుంబం కూడా త‌న‌కు ట‌చ్ లో లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఆక్సీజ‌న్ బెడ్లు అందుబాటులో ఉంటే చెప్పండి అంటూ సోష‌ల్ మీడియాలో క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. ఇక ఈరోజు ఇక తన పరిస్థితి మరింత క్షీణించడంతో శనివారం మరో పోస్ట్‌ పెట్టాడు రాహుల్‌.. “నాకు మంచి ట్రీట్‌మెంట్‌ అందితే ప్రాణాలతో బయటపడతాను. నిజంగా ఇది జరిగితే నాకు పునర్జన్మ దొరికినట్లే లెక్క” అని చెప్పుకొచ్చాడు. ఇది పెట్టిన కొద్ది గంటలకే ఆయ‌న చనిపోవ‌డం దుర‌దృష్ట‌క‌రం.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.