పెళ్ళిలో పూజారి తాళిబొట్టు కొట్టేశాడు..

  0
  59

  కంచె చేను మేస్తే దిక్కెవరు.. పెళ్ళిలో మంత్రాలతో తాళికట్టించాల్సిన పురోహితుడే , తాళి కొట్టేస్తే ఎవరికి చెప్పుకోవాలి..? బహుశా ఇలాంటి దొంగ పురోహితుడు మరెక్కడా ఉండడేమో ..? ఈ దొంగ పూజారి హస్తలాఘవాన్ని వీడియోలో చూసిన పోలీసులు.నోరుతెరిచేశారు . పైగా బంగారు మంగళసూత్రం ఎక్కడని దబాయింపు.. చివరకు చేసేదిలేక పసుపుతాడుకు పసుపుకొమ్ము కట్టి పెళ్లి జరిపించేశారు. అంతా సద్దుమణిగాక పెళ్లి వీడియోలో ఈ పురోహితుడి చేతివాటం బయటపడింది.

  తెలంగాణలోని తూప్రాన్ పడాలపల్లికి చెందిన మున్‌రాతి పెంటయ్య, సుశీల దంపతుల కుమారుడు జ్ఞానేందర్‌దాస్‌కు నర్సాపూర్‌ మండలం గొల్లపల్లికి చెందిన వసంతతో ఈ నెల 16న తూప్రాన్‌లో గజ్వేల్‌కు చెందిన పురోహితుడు చరణ్‌శర్మ వివాహం జరిపించారు.మూడు తులాల బంగారు తాళి బొట్టు చేయించారు.

  దీనివిలువ ఐ లక్ష 20 వేలు.. పెళ్ళిలో అందరిచేత ఆశీర్వాదాలు అందుకున్న తర్వాత , మండపంలో తాళి ఎక్కడికిపోయింది అని అందరూ తలలు బద్దలుకొట్టుకున్నారు. పెళ్లి వీడియోలో పురోహితుడు హస్తలాఘవం బయటపడింది.. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పురోహితుడు పరారీలో ఉన్నాడు.. చివరకు పట్టుకొని నిలదీస్తే తాళిబొట్లు ఓ జ్యువెలరీ దుకాణంలో తాకట్టు పెట్టినట్లు అంగీకరించాడు.

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.