IPL మ్యాచ్ కోసం ఖైదీల నిరాహార దీక్ష.

  0
  255

  టీవిలో IPL మ్యాచ్ రావడం లేదని ఖైదీలు నిరాహార దీక్షకు దిగారు. యూపీలోని ఫరూఖాబాద్ జైల్లో, నిన్నటి నుంచి ఖైదీలు మూకుమ్మడిగా నిరసన వ్యక్తం చేశారు. టిఫిన్, భోజనం మానేసి.. తమకు IPL మ్యాచ్ చూసే అవకాశం ఇవ్వాలని ధర్నా చేస్తున్నారు. దీంతో జైల్లో అలజడి నెలకొంది. టీవిలో IPL చూసే అవకాశం కల్పిస్తే తప్పేమిటంటూ వాదనకు కూడా దిగారు. జైల్లో ఖైదీలు IPL మ్యాచ్ కోసం నిరాహార దీక్ష చేస్తున్నారని తెలిసి.. అధికారులు జైలుకు వచ్చి వారితో చర్చలు జరిపారు. టీవీలో IPL చూసే అవకాశాన్ని కల్పించారు. దీంతో ఖైదీలు నిరాహారదీక్ష విరమించి.. అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.