గర్భిణి ప్రాణం కాపాడిన దిశ యాప్..

  0
  303

  ఆపదలో ఉన్న మహిళలకు అండగా ఉండేందుకు రూపొందించిన దిశ యాప్ ఓ నిండు గర్భిణి ప్రాణాలు కాపాడింది. తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని నిలిపింది. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో ఈ సంఘటన జరిగింది. తోటవారిపాలెం వీవర్స్ కాలనీకి చెందిన పద్మ గర్భవతి. నెలలు నిండిన ఆమె ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో గత అర్థరాత్రి ఆమెకు నెప్పులు ఎక్కువయ్యాయి. సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఏ వాహనం అందుబాటులో లేదు. 108 కూడా సమయానికి ఆ ప్రాంతంలో లేదని తెలుస్తోంది. అయితే ఆమె బంధువులు వెంటనే దిశ ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేశారు. పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఈపూరుపాలెం ఎస్సై స్టేషన్ సిబ్బందిని వెంటనే ఆమె ఉంటున్న ప్రాంతానికి పంపించారు. వారు ఆటోలో గర్భిణి పద్మను ఆస్పత్రికి తరలించారు. ఆమె పండంటి మగబిడ్డను ప్రసవించింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. సకాలంలో ఆస్పత్రికి చేర్చిన పోలీస్ సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఏంచేయాలో తెలీని పరిస్థితుల్లో దిశ యాప్ తమకు ఇలా ఉపయోగపడిందని చెబుతున్నారు పద్మ కుటుంబ సభ్యులు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.