ప్రముఖ విలన్ పొన్నాంబలం ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. కిడ్నీసమస్యతో కొన్నాళ్లుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ అత్యవసరం అని చెప్పారు వైద్యులు. కిడ్నీ దానం చేయడానికి ఆయన మేనల్లుడు సిద్ధంగా ఉన్నా కూడా.. ట్రాన్స్ ప్లాంటేషన్ కి అసరమైన వైద్య ఖర్చులు భరించేందుకు అతని స్థోమత సరిపోలేదు. దీంతో ఆయన సినీ ప్రముఖులు తనకు సాయం చేయాల్సిందిగా ఓ ప్రకటనలో కోరారు.
ఇటీవల సినిమా అవకాశాలు లేకపోవడంతో పొన్నాంబలం కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ సమయంలో రజనీకాంత్, కమల్ హాసన్, రాధిక, శరత్ కుమార్, ధాను ధనుష్, కె ఎస్ రవికుమార్, రాఘవ లారెన్స్, ఐసరి గణేష్ వంటి ప్రముఖులు ఆర్ధిక సహాయం చేశారు.
ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో ఆయన ఆస్పత్రిలోనే ఉంటున్నారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం అవసరమైన డబ్బుకోసం సినీ వర్గాలను అభ్యర్థిస్తూ ప్రకటన విడుదదల చేశారు. దక్షిణ భారత నటీనటుల సంఘం, తెలుగు మా అసోసియేషన్ తరపున తగిన ఆర్ధిక సాయం అందించాలని నటుడు పొన్నంబలం వేడుకున్నారు.
ఇవీ చదవండి…
అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..
భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..
ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..
ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??