వాక్సిన్ పై రాజకీయాలు బాధ పెడుతున్నాయి..

  0
  1835

  కొవాక్సీన్ పంపిణీ విషయంలో కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు బాధకలిగిస్తున్నాయని భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా యల్లా ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ బయోటెక్ సంస్థ కొవాక్సీన్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ వాక్సిన్ సరఫరాపై అపార్ధాలు, అపోహలు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. మంత్రి కొడాలి నాని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈనాడు రామోజీరావు కొడుకు వియ్యంకుడికి సంబంధించిన భారత్ బయో టెక్ తో మాట్లాడి, చంద్రబాబు వాక్సిన్ ఎక్కవగా ఇప్పించవచ్చుకదా అంటూ వ్యాఖ్యానించారు. మరికొన్ని సందర్భాల్లో చంద్రబాబే ఆ సంస్థతో మాట్లాడి వాక్సిన్ ఆపిస్తున్నారని వ్యాఖ్యానించారు. తాజాగా సీఎం జగన్ కూడా కొవాక్సీన్ తయారీ సాంకేతికతను ఇతర కంపెనీలతో పంచుకోవాలని.. ప్రధానికి లేఖ కూడా రాశారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. కొవాక్సీన్ తమకు రానీయకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆయన చెప్పారు. ఈ విషయాన్నీ భారత్ బయో టెక్ సంస్థే ఒక లేఖ ద్వారా తమకు తెలియజేసినదని అన్నారు. ఇలా కొవాక్సీన్ తయారీలో విమర్శలు రావడంతో ఆ కంపెనీ వివరణ ఇచ్చింది. తాజాగా 18 రాష్ట్రాలకు తాము వాక్సిన్ పంపామని.. రేయింబవళ్ళూ పని చేస్తున్నామని.. తమ కంపెనీలోని 50మంది ఉద్యోగులకు కోవిద్ సోకి.. విధులకు దూరంగా వున్నారని.. అయినా ఇటువంటి ఆరోపణలు రావడం బాధాకరమన్నారు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.