అతడూ కావాలి ,నువ్వూ కావాలి..

  0
  2447

  భార్యనూ , ఆమె ప్రియుణ్ణి ఏకాంతంగా పొదల్లో ఉన్నప్పుడు చంపిన భర్త శ్రీనివాసరావు చెప్పిన అసలు నిజం పోలీసులకూ షాక్ ఇచ్చింది. భార్యల్లో ఇంట బరితెగించిన వాళ్లుంటారా అన్న అనుమానం రాకతప్పదు. ఆమెకంటే చిన్న వాడైన యశ్వంత్ తో అక్రమసంబంధం వద్దని చెప్పినా , తనతో ఉంటూ అతడితోకూడా ఉంటానని చెప్పేదని భర్త శ్రీనివాసరావు చెప్పాడు. తాను ఎంతమంచిగా చెప్పినా వినేదికాదని అన్నాడు. నువ్వూ కావాలి , అతడూ కావాలి .. నువ్వు కాదంటే , ప్రియుడితోనే ఉంటానని చెప్పేదని భర్త అన్నాడు. ఇద్దరు , బిడ్డలున్నారని , ఇది మంచిపద్దతి కాదని చెప్పిన వినలేదన్నాడు.. దీంతో విసుగుపుట్టి ఇలా చేసాడని చెప్పాడు.

  22 ఏళ్ల యశ్వంత్ అనే యువకుడితో , 30 ఏళ్ల వయసుండే భార్య జ్యోతి అక్రమ సంబంధం పెట్టుకుంది . భర్త శ్రీనివాస రావు ఆమెకు పెళ్లయిన పదేళ్ల నుంచి ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. అయితే భర్త ఉద్యోగానికి పోతున్నప్పుడు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యశ్వంత్ , భార్యకు దగ్గరయ్యాడు. ఇద్దరు ఇంట్లోనే ఉండటం భర్త శ్రీనివాసరావు రెండు సార్లు చూశాడు. ఇది మంచి పద్దతి కాదని నచ్చజెప్పాడు. భార్య .మీద ప్రేమతో మౌనంగానే వుండిపోయాడు. అయితే భర్త మంచితనాన్ని ప్రేమను భార్య అలుసుగా తీసుకుంది . తన కంటే చిన్నవాడైన ప్రియుడితో విచ్చలవిడిగా పెరగటం మొదలు పెట్టింది. దీంతో భర్త శ్రీనివాసరావు సహించలేకపోయాడు .

  దీంతో ఆమెను చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. తాను ఊరు వెళ్తున్నానని రాత్రికి రానని చెప్పి బయలుదేరి పోయాడు. అయితే సమీపంలోని ప్రాంతంలో కాపు కాసాడు. భర్త ఊరు వెళ్తున్నాను అని చెప్పడంతో భార్య జ్యోతి , ప్రియుడు యస్వంత్ కి సమాచారం పంపించింది. ఇద్దరు కలిసి స్కూటర్పై బయలుదేరారు. ఊరిబయట 30 కిలోమీటర్ల తరువాత ఉన్న ఏకాంత ప్రదేశంలో లోకి ఇద్దరూ పోయారు . ఇదంతా వెనకనుంచి వాళ్లని ఫాలో అవుతున్న శ్రీనివాసరావు చూస్తూనే ఉన్నాడు. ఇద్దరు పొదల్లోకి పోవడంతో , పెద్ద బండరాయి తీసుకొని కొట్టి చంపేశాడు.. ప్రియుణ్ణి కత్తితో పొడిచి అంతంచేశాడు.. పోలీసులు , శ్రీనివాసరావుని , మరో ఇద్దరినీ అరెస్ట్ చేశారు..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.