ఆ ఒక్క క్షణమే ఆమెకు మళ్ళీ ఊపిరిపోసింది.

    0
    208

    చావుకి , బ్రతుక్కి మధ్య ఒక్క క్షణం.. ఆ ఒక్క క్షణమే ఆమెకు మళ్ళీ ఊపిరిపోసింది.. ఉరితాడుకు వేలాడుతూ , మృత్యువు చేతికి చిక్కిన ఆమెను , మళ్ళీ బయటకు తెచ్చింది.. దీనికి కారణం ఒక స్నేహితుడి మెరుపులాంటి ఆలోచన .. హైదరాబాద్ పోలీసుల లైట్నింగ్ యాక్షన్.. లేకుంటే ఈ మాజీ మిస్ తెలంగాణ , ఈ లోకాన్నే మిస్ అయ్యేది. హాసిని అనే ఈ యువతి డిప్రెషన్ తో బాధపడుతొంది.. దీంతో బుధవారం రాత్రి పదిన్నరకు తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఫ్రెండ్స్ , తల్లితండ్రులకు వీడియో కాల్ చేసి , మాట్లాడుతూనే ఉరేసుకునేందుకు , చున్నీ ఫ్యానుకు కట్టింది..

    అమ్మా , నాన్నా క్షమించండి.. ఆత్మహత్య తప్పుఅని తెలిసికూడా చేసుకుంటున్నా , ఒక సారి యాసిడ్ దాడిని ఎదుర్కొన్నా , నిత్యం సూటిపోటిమాటలను ఎదుర్కొంటున్నా , వేధింపులను ఎదుర్కొన్నా … ఇక బ్రతకాలని లేదు.. అందరికీ గుడ్ బై ..అంటూ ఉరి బిగించుకొని, కాళ్ళకింద స్టూల్ తన్నేసింది.. కాసేపటికే ఆమెకూడా చున్నీ తెగిపోయి కిందపడింది.. అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. అంతే , ఆ క్షణంలో పోలీసులు మెరుపులా వచ్చి ఆమెను పట్టుకొని , చున్నీ కోసేశారు.. అపస్మారక స్థితిలోఉన్న ఉన్న ఆమెను హాస్పిటల్లో చేర్పించారు.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగాఉంది..

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..