ఫైజర్ పిల్లల టీకాకు అత్యవసర అనుమతి..

  0
  37

  పిల్లలలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఫైజర్ కంపెనీ తయారు చేసిన టీకాకు యూరోపియన్ యూనియన్ అనుమతి లభించింది. 12నుంచి 15ఏళ్లలోపు వారికి ఈ టీకా వినియోగిస్తారు. మూడువారాల గ్యాప్ లో మూడుసార్లు ఈ టీకాను పిల్లలకు అందిస్తారు. యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ అనుమతి ఇవ్వడంతో.. యూరోపియన్ యూనియన్ లో దీన్ని వినియోగించబోతున్నారు. ఇప్పటికే అమెరికా, కెనడాల్లో ఈ టీకాకు ఎమర్జెన్సీ అనుమతి లభించింది. ఇకపై యూరోపియన్ యూనియన్ లో కూడా పిల్లలకు ఫైజర్ కంపెనీ టీకా వేస్తారు. ఇప్పటి వరకూ ఈయూలో 16ఏళ్ల పైబడినవారికి మాత్రమే టీకాలు అందిస్తున్నారు. ఇకపై 12ఏళ్లపైబడినవారికి కూడా టీకాలు ఇస్తారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..