బాబు సీఎంగా వారం ఉంటే కరోనా పారిపోతుంది.

  0
  1021

  సీఎం ప‌ద‌వి ఇస్తే, వారం రోజుల్లో…
  చంద్ర‌బాబు క‌రోనాని త‌రిమేస్తాడు…
  ==================
  ఒక వారం రోజుల పాటు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌ప్పుకుని ఆ బాధ్య‌త‌ల‌ను చంద్ర‌బాబు నాయుడికి ఇవ్వాల‌ని టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి రామ్ సూచించారు. చంద్ర‌బాబుకి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే వారం రోజుల్లో క‌రోనాని అణిచేస్తాడ‌ని, క‌రోనా క‌ల్లోలం నుంచి రాష్ట్రాన్ని ఎలా గ‌ట్టెక్కించాలో చేసి చూపిస్తాడ‌ని అన్నారు. ద‌మ్ముంటే వారం రోజుల పాటు చంద్ర‌బాబుకు బాధ్య‌త‌లు ఇవ్వాల‌ని కోరారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్ర‌బాబుకి ఒక్క వారం స‌రిపోతుంద‌న్నారు. ప్ర‌కృతి వైప‌రిత్యాలు, విప‌త్తులు వ‌చ్చిన‌ప్పుడు ఏ విధంగా చేయాలో, ఎలా కాపాడాలో బాగా తెలుస‌ని చెప్పారు. ఉత్త‌రాఖండ్ వ‌ర‌ద‌లు, హుదుద్ తుఫాను స‌మ‌యంలో చంద్ర‌బాబు సేవ‌లు ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌ని కూడా గుర్తు చేశారు. అందువ‌ల్ల రాష్ట్రం నుంచి క‌రోనా పారిపోవాలంటే చంద్ర‌బాబును సీఎం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.