చెట్లైనా ఆక్సిజన్ ఇస్తాయని..ఇదీ దౌర్బాగ్యం.

  0
  38

  క‌రోనాతో యావ‌త్ దేశం క‌కావిక‌ల‌మైంది. ఆక్సీజ‌న్ కొర‌త‌తో ఎన్నో ప్రాణాలు గాలిలో క‌లిసిపోయిన ఘ‌ట‌న‌లు కోకొల్ల‌లు. దీంతో ఆక్సీజ‌న్ కోసం పేషంట్లు ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. అయితే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని మేవ్లా గోపాల్క‌ర్, నౌబ‌రి ప్రాంతాల్లో క‌రోనా రోగులు మాత్రం ఆక్సీజ‌న్ దొర‌క‌క చెట్ల‌ను ఆశ్ర‌యిస్తున్నారు.

  చెట్ల నుంచి వ‌చ్చే ఆక్సీజ‌న్ తో ఊపిరి తీసుకోవ‌చ్చ‌నే ఆశ‌తో ఇలా చెట్ల కింద‌కి చేరుతున్నారు. నౌబ‌రి ప్రాంతంలో క‌రోనాతో పోరాడుతున్న రోగులు రావి చెట్టు కింద గాలి బాగా వ‌స్తుంద‌ని ఆ చెట్టు నీడ‌కు వెళితే… మ‌రికొంద‌రు వేప చెట్టు కింద‌కు చేరుతున్నారు. ఇలా క‌రోనా రోగులంతా సెలైన్లు పెట్టుకునే ఈ ప్రాంతాల్లో ఆక్సీజ‌న్ కోసం చెట్ల పంచ‌న చేరుతున్నారు.

   

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు