ఐపీఎస్ అయినా నన్ను మోసం చేసినవాడ్ని వదలను.

  0
  235

  ఇదో విచిత్రమైన కేసు, తండ్రి ఓ మాజీ ఎమ్మెల్యే, బాధ్యత గల ప్రజా ప్రతినిధి. పేరు బానోత్ మదన్ లాల్. కొడుక ఐపీఎస్ ఆఫీసర్. శిక్షణలో ఉన్నాడు. పేరు మృగేందర్ లాల్. అయితే ఐపీఎస్ కి సెలక్ట్ అయ్యే ముందే మృగేందర్ లాల్ ఓ యువతిని మోసం చేశాడు. ప్రేమ పేరుతో చేరువై తనను మోసం చేశాడని, నమ్మకంగా దగ్గరకు తీసుకుని మానభంగం చేశాడని ఆరోపిస్తోంది ఆ యువతి. ఈమేరకు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. ఆ తర్వాత యువతి ఇంటికి సదరు మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ వెళ్లారు.

  యువతితో మదన్ లాల్ పోట్లాడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ యువతి మామయ్యా అంటూ మర్యాదగా మాట్లాడుతున్నా.. నా కొడుకు చీటరే, వాడు చీటరే అంటూ తండ్రి సర్దిచెప్పుకుంటూ వస్తున్నాడు. వాడ్ని వదిలిపెట్టు అని హెచ్చరిస్తున్నాడు. తనకి అన్యాయం చేస్తే వదిలి పెట్టబోనంటూ యువతి కూడా ఖరాఖండిగా చెప్పేసింది. కోర్ట్ ఆప్ లా లేదు, ఏమీ లేదు, పిచ్చిదానా ఈ పేపర్లతో ఏం చేస్తావంటూ అక్కడున్న జిరాక్స్ కాపీలను, కంప్లయింట్ కాపీలను విసిరి కొట్టాడు మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..