నెల్లూరు జిల్లాలో సర్పంచ్ అభ్యర్థిగా 82ఏళ్ల వృద్ధురాలు..

    0
    886

    నెల్లూరు జిల్లాలో 82ఏళ్ల వృద్ధురాలు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగి రికార్డు సృష్టించారు. ఆమె పేరు దువ్వూరు విజయలక్ష్మి. నాయుడుపేట మండలం మర్లపల్లి పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో విద్యాశాఖలో ఉన్నతాధికారిణిగా విధులు నిర్వర్తించిన ఆమె పదవీ విరమణ అనంతరం పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నా, తాను మాత్రం ఎప్పుడూ వాటి జోలికి వెళ్లలేదు. అయితే తన అక్క కుమారుడు అకాల మరణంతో ఆమె రాజకీయ అరంగేట్రానికి లేటు వయసులో టైమ్ వచ్చింది.

    ఎన్నికలకు, రాజకీయాలకు ఆమె స్వతహాగా దూరం. కానీ తన కుటుంబంలో జరిగిన ఓ పరిణామం ఆమెను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచేలా చేసింది. 82ఏళ్ల వయసులో నామినేషన్ వేసేలా పరిస్థితులు ఆమెను ముందుకు నడిపించాయి.

    దువ్వూరు విజయలక్ష్మి అక్క కుమారుడు వెంకట కృష్ణారెడ్డి మర్లపల్లికి రెండు దఫాలు సర్పంచిగా పని చేశారు. మూడోసారి కూడా ఆయనే బరిలో దిగుతారని అనుకున్నారంతా. నామినేషన్ కి కూడా అంతా సిద్ధం చేశారు. కానీ అయిదు రోజుల కిందట గుండెపోటుతో కృష్ణారెడ్డి మృతి చెందారు. తనకు బిడ్డ వరసయ్యే కృష్ణారెడ్డి కోరిక తీర్చడంకోసం, గ్రామస్తుల బలవంతంతో చివరకు విజయలక్ష్మి నామినేషన్ వేశారు. అలా పరిస్థితుల కారణంగా 82ఏళ్ల వయసున్న విజయలక్ష్మి, మర్లుపల్లి పంచాయతీ బరిలో సర్పంచ్ అభ్యర్ధిగా నిలిచారు.

    ఇవి కూడా చదవండి: 

    పెళ్ళైన రెండునెలలకే భార్యను దారుణంగా చంపేశాడు..

    ఇండియన్ వయాగ్రా సూపర్ అంట

    ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?