మీ కొత్త మొబైల్ ఒరిజినలేనా..?

  0
  238

  మార్కెట్లోకి రకరకాల మోడళ్లలో, రకరకాల బ్రాండ్లలో కొత్త ఫోన్లు వస్తూనే ఉన్నాయి. మూడు నెలలకు ఓ కొత్త ఫోన్ వాడేవారు కూడా మన మధ్య ఉన్నారు. మరి పాత ఫోన్ల సంగతేంటి. వారు వాడేసిన ఆ పాత ఫోన్లు ఎవరు తీసుకెళ్తున్నారు. ఎక్సేంజ్ ఆఫర్లలో పాత ఫోన్లు సేకరిస్తున్న కంపెనీలు వాటిని ఏం చేస్తున్నాయో తెలుసా? ఆన్ లైన్ లోనే కాదు.. తాజాగా ఆఫ్ లైన్ లోనూ ఇలాంటి బై బ్యాక్ లు జరుగుతూనే ఉన్నాయి గతంలో పాత చీరలకు ఉల్లిపాయలిస్తాం, పాత ప్లాస్టిక్ డబ్బాలకు స్టీల్ గ్లాసులిస్తాం అంటూ ఊరూరా తిరుగుతున్న వ్యాపారులు ఇప్పుడు పాత మొబైల్ ఫోన్లకు ఉల్లిపాయలిస్తామంటూ కొత్త బిజినెస్ మొదలు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడీ బిజినెస్ జోరుగా సాగుతోంది.

  పాత ఫోన్లు ఎక్కడికెళ్తాయి..?
  ఇలా వీరు ఊరూరా తిరిగి సేకరించిన పాత ఫోన్లను ఏం చేస్తారో తెలుసా..? ఈ పాతఫోన్లను ఓ పంజాబ్ కంపెనీ సేకరిస్తోంది. ఆ కంపెనీ వాటిని కౌరు చౌకగా దక్కించుకుని ప్రధాన కంపెనీలకు అందిస్తోంది. వీటినే రీ ఫర్బిష్డ్ పేరుతో ప్రముఖ కంపెనీలు మళ్లీ ఆన్ లైన్లో అమ్ముతుంటాయి. అయితే అక్కడే ఓ మతలబు ఉంది. రీ ఫర్బిష్డ్ పేరుతో అమ్మే ఫోన్లే కాదు, కొత్త స్టాక్ అని అమ్మే ఫోన్లలో కూడా ఇలాంటి పాత సామాను వాడుతుంటారని తెలుస్తోంది.

  అంటే సెకండ్ హ్యాండ్ ఫోన్లనే మళ్లీ ఫ్రెష్ స్టాక్ గా కంపెనీలు వినియోగదారులకు అంటగడుతున్నాయి. రిపేర్ వస్తే వెంటనే పీస్ టు పీస్ వాపసు ఇస్తారు కాబట్టి.. ఇక్కడ కస్టమర్లు కూడా పెద్దగా ఇబ్బంది పడేదేమీ ఉండదు. ఎక్కడో నూటికో కోటికో ఓ ఫోను రిపేరు వస్తుంది. అలా వచ్చిన వాటిని కూడా వారంటీపైన ఉచితంగానే సర్వీస్ సెంటర్లలో రిపేర్ చేసి ఇస్తుంటారు. చాలామంది అసలు రిపేరు వచ్చే వరకు కూడా ఫోన్లు వాడరు, వాటిని వెంటనే మార్చేస్తుంటారు. ఈ క్రమంలో అసలు మనం వాడేవి కొత్త ఫోన్లేనా అనే అనుమానం రాకమానదు.

  ఐఎంఈఐ నెంబర్ సంగతేంటి..?
  మొబైల్ కొత్తదో పాతదో కనిపెట్టాలంటే ఐఎంఈఐ నెంబర్ తో గుర్తించే అవకాశం ఉంది. అయితే వాటిని కూడా మార్చేసే టెక్నాలజీ నేడు వచ్చేసింది. అంటే ఒక మొబైల్ కొత్తదా, పాతదా అనేది కంపెనీ వాళ్లకి తప్పితే ఇంకెవరికీ తెలియదనమాట. ఉల్లిపాయలకి పాత ఫోన్లు అమ్మేసి, మళ్లీ వాటినే మనం ఆన్ లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటున్నామనమాట.

  ఇవీ చదవండి

  క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

  భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

  బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..