కాళ్ళు కడిగి కన్యాదానం.. దత్త కూతురికి ముస్లిం తల్లి ప్రదానం..

    0
    1707

    కులాలు, మతా పేరుతో విద్వేషాలు చోటు చేసుకుంటున్న నేటి కాలంలో ఓ ముస్లిం కుటుంబం తాము దత్తత తీసుకున్న హిందూ యువతి పెళ్లి వేడుకలో కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. హిందూ సాంప్రదాయం ప్రకారమే ఆమెకు పెళ్లి చేశారు. బాన్సువాడలోని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న ఇర్ఫానా 10ఏళ్ల కిందట చందన్ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆ బాలిక తల్లిదండ్రులు ఓ ప్రమాదంలో చనిపోవడంతో అనాథ అయిన ఆ బిడ్డకు ఇర్ఫానా తల్లి అయింది. అప్పటికే ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయినా చందనను దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసి చదివించారు.

    చందన ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ లో ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ పూర్తి చేయించింది. ఇతర టీచర్లతో కలసి ఆమెకు పెళ్లి చేయాలనే ప్రయత్నం చేసింది. బొమ్మన్ దేవ్ పల్లిలో ఎలక్ట్రీషియన్ గా పనిచేసే వెంకట్రామి రెడ్డితో సంబంధం కుదిరింది. ఆ బాలిక, పెళ్లి కొడుకు కోరిక ప్రకారం హిందూ సాంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసింది.

    తన భర్త షేక్ అహ్మద్ తో కలసి వరుడు కాళ్లు కడిగింది. కన్యాదానం చేసింది. ఇర్ఫానా మానవతా చర్యను, దత్తత తీసుకున్న బిడ్డపై ఆమె వాత్సల్యాన్ని అందరూ ప్రశంసించారు. ఆరో తరగతిలో ఉన్నప్పుడు చందనను దత్తత తీసుకున్నానని, అదే పేరుతో, అదే సంప్రదాయంలో బిడ్డను పెంచానని, మానవత్వానికి మతం అడ్డుకాదని అందుకే తన దత్త కూతురి ఇష్ట ప్రకారమే ఆమె పెళ్లి చేశానని ఇర్ఫానా చెప్పింది.

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..