తెలంగాణాలో కర్ఫ్యూ.. నేటి నుంచే..

  0
  176

  కరోనా కల్లోలం తెలంగాణాను ఊపేస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటలవరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. పదిరోజులు.. అంటే మే ఒకటవ తేదీవరకూ ఈ నిభందనలు వర్తిస్తాయి. రాత్రి 8 గంటలకే అన్ని వ్యాపార సముదాయాలు మూసివేయాలని ఆదేశాలిచ్చారు. అత్యవసర సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. బస్సులు, రైళ్లు దిగి.. రాత్రి సమయాల్లో ఇళ్లకు వెళ్లేవారు తమ టికెట్ ను చూపించాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణాలోకి వచ్చే వాహనాలపై ఎటువంటి ఆంక్షలు ఉండవు. తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాదులో గతఏడాది కంటే కరోనా కల్లోలం ఎక్కువగా ఉంది. పరిస్థితి అదుపులోకిరాకపోతే మే 2వ తేదీన అధికారుల సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.