ఎర్ర అండర్ వేర్ న్యూ ఇయర్ సెంటిమెంట్.

  0
  161

  కొత్త సంవ‌త్స‌రంలో శుభం క‌ల‌గాల‌ని దేవాల‌యాల‌కు వెళ్ళ‌డం, శుభాకాంక్ష‌లు చెప్పుకోవ‌డం వంటివి చేస్తుంటారు. అయితే కొన్ని దేశాల్లో విచిత్ర‌మైన సంప్ర‌దాయాలున్నాయి. ద‌క్షిణ ఆఫ్రికాలో ప్ర‌జ‌లు కొత్త సంవ‌త్స‌రం రోజున న‌లుపు క‌న్ను ఉన్న బ‌ఠానీ గింజ‌ల‌ను తిన‌డం శుభంగా భావిస్తారు. స్పెయిన్ లో రాత్రి 11.55 గంట‌ల‌కు నెల‌కు ఒక‌టి చొప్పున 12 ద్రాక్ష పండ్లు తింటారు. చాలామంది అమెరిక‌న్ల‌లో ఈనాటికీ ఒక విచిత్ర‌మైన న‌మ్మ‌కం ఉంది. కొత్త సంవ‌త్స‌రం రోజున ఎర్ర రంగు అండ‌ర్ వేర్ వేసుకుంటే చాలా శుభం క‌లుగుతుంద‌ని న‌మ్ముతారు. అంటే డిసెంబ‌ర్ 31వ తేదీ రాత్రే ఈ ఎర్ర రంగు అండ‌ర్ వేర్ వేసుకుంటారు. ఇదే సంప్ర‌దాయం అమెరికా కంటే ముందు స్పెయిన్, ఇట‌లీ, చైనా దేశాల్లో కూడా ఉండేది. అయితే అమెరికన్లు చాలామంది ఈ ప‌ద్ద‌తి కొన‌సాగించారు.

  దీని వెన‌క మ‌ధ్య యుగాల నాటి ఓ న‌మ్మ‌కం నేటి ఆధునిక యుగానికీ త‌ర‌త‌రాలుగా కొన‌సాగుతూ వ‌స్తోంది. మ‌గ‌వాళ్ళు త‌మ మొల‌కు చుట్టూ ఎర్ర రంగు వ‌స్త్రం క‌ట్టుకుంటే, క్షుద్ర‌శ‌క్తులు ఆ ప్రాంతాల‌కు చేర‌లేవ‌న్న‌ది ఒక న‌మ్మ‌కం. లేక‌పోతే క్షుద్ర‌శ‌క్తులు న‌డుం ప్రాంతంపై దృష్టి పెట్టి, సంతానోత్ప‌త్తిని దెబ్బ తీస్తాయ‌ని అందువ‌ల్ల ఎర్ర రంగు వ‌స్త్రం ఉంటే క్షుద్ర శ‌క్తులు అక్క‌డికి రావ‌న్న‌ది చాలామంది అమెరిక‌న్ల విశ్వాసం. అందుకే కొత్త సంవ‌త్స‌రం ముందురోజు రాత్రి ఖ‌చ్చితంగా ఎర్ర రంగు అండ‌ర్ వేర్ వేసుకుంటారు. ఈ అండ‌ర్ వేర్ సొంతంగా కొన్న‌ది కాకుండా ఇత‌రులు గిఫ్ట్ ఇచ్చింది అయితే ఇంకా మంచిద‌ని, అది కొత్త‌దిగానే ఉండాల‌ని న‌మ్ముతారు. ప్ర‌పంచం శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో ముందుకెళుతున్నా.. కొన్ని దేశాల్లో ఇలాంటి న‌మ్మ‌కాలను విశ్వ‌సిస్తూనే ఉండ‌డం విశేషం.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..