కాఫీ కప్పులో వీర్యం.. అదో శాడిజం…

  0
  178

  టెర్రరిస్టుల్లో ఎన్నిరకాలుంటారో తెలియదు. మనకి తెలిసిందల్లా ఉగ్రవాదులు, తీవ్రవాదుల్ని టెర్రరిస్టులు అనడం. అయితే ఇప్పుడు దక్షిణ కొరియాలో సెమన్ టెర్రరిస్ట్ లు వీరవిహారం చేస్తున్నారు. సెమన్ టెర్రరిస్ట్ లను అరికట్టేందుకు పార్లమెంట్ లో ఏకంగా ఒక బిల్లు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ సెమన్ టెర్రరిజం అంటే ఏమిటో తెలుసా..?

  వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్ లు, ఇలాంటివాటిలో మగవారు తమ వీర్యాన్ని మహిళల వస్తువుల్లో పారేయడం, వారి కాఫీ కప్పుల్లో కలపడం, వారికిచ్చే మంచినీళ్లలో మిక్స్ చేయడం.. ఇలాంటి వాటిల్తో సెమన్ టెర్రరిజం దక్షిణ కొరియాలో సంచలనం సృష్టిస్తోంది. మే నెలలో ఒక ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారి తన కొలీగ్ కాఫీ కప్పులో వీర్యం కలిపాడని 2500 డాలర్ల ఫైన్ వేశారు. ఇలా అతను ఆరు దఫాలు చేసినట్టు కోర్టులో ఒప్పుకున్నాడు. ఓ గ్రాడ్యుయేట్ స్టూడెంట్, ఓ మహిళ కాఫీ కప్పులో 54సార్లు వీర్యం కలిపాడు. దీంతోపాటు ఉమ్మి, గళ్ల, మూత్రం ఇలాంటివన్నీ అప్పుడప్పుడు కలిపి ఆమెకు కాఫీ ఇచ్చేవాడు. ఆమె ఓ రెస్టారెంట్ లో కాఫీ తాగేందుకు రెగ్యులర్ గా పోతుంది. రెస్టారెంట్ ఉద్యోగి ఒకడు ఇచ్చిన సమాచారంతో సీసీ కెమెరాల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు. అతనికి మూడేళ్లు జైలు శిక్ష విధించారు.

  మరో కేసులో మహిళ తనకు లొంగలేదని, ఓ వ్యక్తి ఆ మహిళ హ్యాండ్ బ్యాగ్ లో కండోమ్ లో తన వీర్యం ఉంచి అందులో పెట్టేశాడు. ఇలా దక్షిణ కొరియాలో సెమన్ టెర్రరిజం విజృంభిస్తోంది. దీన్ని ఇప్పటి వరకు మహిళల ఆస్తులపై దాడిగా పోలీసు కేసులు నమోదవుతున్నాయి.

  అలా కాకుండా ఈ సెమన్ టెర్రరిజాన్ని సెక్స్ క్రైమ్ గా పరిగణించాలని పార్లమెంట్ సభ్యుడు బీక్ హియున్ పార్లమెంట్ లో ఒక బిల్లు ప్రవేశ పెట్టాడు. కాలేజీలు, స్కూళ్లలో ఈ సెనన్ టెర్రరిజంతో ఆందోళన మొదలవుతోంది.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..