జూన్ 30వరకు కొవిడ్ మార్గదర్శకాలు.

  0
  29

  దేశంలో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నా.. ముందు జాగ్రత్త చర్యగా దేశవ్యాప్తంగా జూన్ 30వరకు కొవిడ్ మార్గదర్శకాలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 29న జారీ చేసిన మార్గదర్శకాలు జూన్ 30వరకు కనసాగుతాయని తెలిపింది. ఈమేరకు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు.

  కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. దక్షిణ, ఈశాన్యంలోని పలు ప్రాంతాలకు మినహాయింపును ఇచ్చింది. కొత్తగా కరోనా కేసులు తగ్గుతున్నా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న కారణంగా మార్గదర్శకాలు పొడిగిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు నియంత్రణ చర్యలు కచ్చితంగా కొనసాగించడం చాలా ముఖ్యమన్నారు కేంద్ర హోంశాఖ కార్యదర్సి అజయ్ భల్లా.

  స్థానిక పరిస్థితులు, అవసరాలు, వనరులను అంచనా వేసిన తర్వాత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏదైనా సడలింపులను తగిన సమయంలో, గ్రేడెడ్‌ పద్ధతిలో పరిగణించవచ్చని రాష్ట్రాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్‌ 29న జారీ చేసిన మార్గదర్శకాలు జూన్‌ 30 వరకు కొనసాగుతాయని చెప్పారు. మార్గదర్శకాల మేరకు ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్లు, తాత్కాలిక ఆసుపత్రుల ఏర్పాటుతో పాటు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలి. ఐసోలేషన్‌ వసతులతో పాటు అవసరమైన చర్యలు తీసుకోవాలని హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది. అయితే, తాజా మార్గదర్శకాల్లో లాక్‌ డౌన్‌ పై హోంశాఖ ఎలాంటి ప్రస్తావన చేయలేదు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..