11 మంది కేంద్ర మంత్రులపై వేటు పడింది..

  0
  557

  ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ కేంద్ర‌మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో 11 మంది మంత్రులపై వేటు ప‌డింది. వీరంద‌రినీ మ‌ద్యాహ్నం 12 గంట‌ల‌కు ప్ర‌ధాని కార్యాల‌యానికి పిలిపించి రాజీనామాలు తీసుకున్నారు. మ‌రికొంత‌మందిని రాజీనామాలు పంపాల్సిందిగా ఆదేశించారు. రాఈనామాలు చేసిన వారిలో కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఉన్నారు. దేశంలో కోవిడ్ నియంత్ర‌ణ‌లో కేంద్ర ఆరోగ్య శాఖ‌పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ విష‌యంలో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. దేశం మొత్తంలో ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా, మందులు లేక‌పోవ‌డం వంటి దారుణాల‌తో అంత‌ర్జాతీయ‌స్థాయిలో క‌రోనా క‌ట్ట‌డిలో భారత‌దేశం వైఫ‌ల్యం స్ప‌ష్టంగా క‌నిపించింది. దీన్ని ఆయ‌న‌ను బాధ్యుడిని చేస్తూ ఇప్పుడు త‌ప్పించారు. విద్యాశాఖ మంత్రి ర‌మేష్ పోక్రియాల్ మరికొంత‌మంది కేంద్ర‌మంత్రులు రవిశంకరప్రసాద్ ,బాబుల్ సుప్రియో, సంతోష్ గంగ్వార్, దేవ‌శ్రీ చౌద‌రి, ర‌త‌న్ లాల్ క‌టారియా, సంజ‌య్ ధోత్రి, త‌వ‌ర్ చంద్ర జ‌హ్లాట్, ప్ర‌తాప్ చంద్ర సారంగి, అశ్వ‌నీ చౌబే ఉద్వాస‌న‌కు గురైన వారిలో ఉన్నారు. తెలంగాణ‌కు చెందిన ర‌క్ష‌ణ‌శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డిని కేబినెట్ మంత్రిగా చేశారు. కొత్త మంత్రుల జాబితా ప్ర‌ముఖుల్లో నారాయ‌ణ‌రాణే, జ్యోతిరాదిత్య సింధియా, కిర‌ణ్ రిజ్జు, శోభాక‌ర‌ణ్ ల‌జే ఉన్నారు. కొత్త‌మంత్రులుగా 43 మంది ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.