సినిమా ఛాన్స్ పేరుతో మోసం..

    0
    577

    సినిమా అవకాశం వస్తుందనే సరికి ఎగిరిగంతేసింది ఆ అమ్మాయి. అసిస్టెంట్ డైరెక్టర్ గా పరిచయం చేసుకున్న యువకుడితో కాస్త చనువుగా ఉంది. ఆ చనువుని అడ్డం పెట్టుకుని ఆ కేటుగాడు అమ్మాయిని లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. అతడి చేష్టలను భరించలేక ఆ అమ్మాయి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

    సినిమా అవకాశాల పేరుతో అమ్మాయిలకు వల వేస్తున్న కీచక దర్శకుడి బండారం ఆ అమ్మాయి ఫిర్యాదుతో బయటపడింది. ప్రవీణ్‌ కుమార్‌ అనే వ్యక్తి తాను చెన్నైలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌నని ప్రస్తుతం షార్ట్‌ ఫిల్మ్స్‌ తీయబోతున్నట్లు ప్రచారం చేసుకుంటూ, అందుకు నటీమణులు కావాలని అమ్మాయిలకు నమ్మబలికే వాడు. ఇందులో భాగంగా సూళ్లూరుపేటలో శ్రీ చెంగాలమ్మ మహత్యం మూవీ క్రియేషన్స్ పేరిట కార్యాలయం కూడా ప్రారంభించాడు. యువతుల ఆశను అవకాశంగా మార్చుకుంటూ వారిపై లైంగికి దాడులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయిని లైంగిక వేధింపులకు గురిచేస్తుంటే అది భరించలేక ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అనంతరం సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్‌లో బాధిత యువతి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ప్రవీణ్, చిత్ర యూనిట్ సభ్యులు పరారీలో ఉన్నారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.