వాక్సిన్ వేసిన వెంటనే పక్షవాతం. కారణమిదీ..

  0
  1304

  దేశ‌వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. 18 ఏళ్ళ వ‌య‌సు వారి నుంచి పండు ముద‌స‌లి వ‌ర‌కు వ్యాక్సిన్లు వేయించుకుంటున్నారు. ఎక్క‌డో ఒక‌టి అర చిన్న‌చిన్న స‌మ‌స్య‌లు త‌ప్ప‌, వ్యాక్సిన్ వ‌ల్ల ఎలాంటి ఉప‌ద్ర‌వాలు జ‌ర‌గ‌లేద‌ని నిరూపిత‌మ‌య్యాయి. ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ల‌లిత్ పూర్ లో అహిర్వాల్ అనే 22 ఏళ్ళ యువ‌కుడు సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. కాసేప‌టికే ఆ యువ‌కుడికి నొప్పులు రావ‌డంతో అక్క‌డిక‌క్క‌డే కింద‌ప‌డిపోయాడు.

  కొద్దిసేప‌టికే కుడి చేయి, కుడి కాలు అచేతనం కావ‌డంతో ప‌క్ష‌వాతం సోకిన‌ట్లు అక్క‌డి వైద్యుల‌కు అర్ధ‌మైంది. వెంట‌నే అత‌ని కండిషన్ గుర్తించి, ఝాన్సీ మెడిక‌ల్ కాలేజీకి చికిత్స కోసం త‌ర‌లించారు. అత‌ని సీరియ‌స్ కండిష‌న్ చూసి వ్యాక్సిన్ కార‌ణంగా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని భావించారు. అయితే ఎక్స్ రే తీస్తే, వ్యాక్సిన్ వేసిన చేతి భాగంలో విరిగిన ఇంజెక్ష‌న్ నీడిల్ క‌నిపించింది. విరిగిన ఆ నీడిల్.. శ‌రీరంలోని ఓ న‌రానికి హాని క‌లిగించ‌డంతో అహిర్వాల్ కు ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని నిర్ధారించారు. మొత్తానికి శ‌స్త్ర‌చికిత్స చేసి ఆ నీడిల్ ను తీసివేశారు డాక్ట‌ర్లు. అయినా ఇప్ప‌టివ‌ర‌కు అత‌ని అవ‌య‌వాలు స్వాధీనంలోకి రాలేదు. నెమ్మ‌దిగా వ‌స్తాయ‌ని, ఇంకా కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.