మరి కాసేపట్లో విడుదల..

  0
  172

  చత్తీస్ ఘడ్ కాల్పుల ఘటన తర్వాత మావోయిస్ట్ ల చెరలో బందీగా చిక్కుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ కి విముక్తి లభించబోతోంది. మరి కాసేపట్లో ఆయన్ను మావోయిస్ట్ లు విడుదల చేయబోతున్నారని సమాచారం. రాకేశ్వర్ ని వదిలేస్తామని మధ్యాహ్నం 3.45గంటలకు మావోయిస్టులు సమాచారమిచ్చారు. జవాన్‌ కోసం ఓ మాజీ నక్సలైట్‌ అడవిలోకి వెళ్లి వెనక్కి తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది. సాయంత్రం 6.30 గంటల తర్వాత జవాన్‌ను విడుదల చేయవచ్చని సమాచారం. బీజాపూర్‌ దాడి ఘటనలో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ రాకేశ్వర్‌ సింగ్‌ మావోయిస్టులకు చిక్కిన విషయం తెలిసిందే. గత ఐదు రోజులుగా వారి చెరలోనే ఉన్నారు. ఆ జవాన్‌ తమ వద్ద సురక్షితంగానే ఉన్నట్టు తెలుపుతూ మావోయిస్టులు ఆయన ఫొటో విడుదల చేశారు. మరోవైపు రాకేశ్వర్ సింగ్ కుటుంబ సభ్యులు కూడా ఓ వీడియో విడుదల చేశారు, ఆయన్ను వదిలిపెట్టాలని మావోయిస్ట్ లకు విజ్ఞప్తి చేశారు.

  ఇవీ చదవండి

  వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

  ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

  టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

  కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ