నాటు నాటు పాటకు పునీత్ స్టెప్పులేస్తే..

    0
    21982

    నాటు నాటు పాటకు పునీత్ స్టెప్పులేస్తే.. ఇలా ఉంటుంది..

    నాటు నాటు పాటకు పునీత్ రాజ్ కుమార్ బతికుంటే స్టెప్పులేస్తే ఎలా ఉంటుందో అని, రాజ్ కుమార్ పాత డ్యాన్స్ లు అన్నీ పెట్టి, దాని మ్యూజిక్ కి అనుగుణంగా, ఆయన స్టెప్స్ కి అనుగుణంగా ప్రమోద్ అనే వ్యక్తి ఓ వీడియో తయారు చేశాడు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    రామ్ చరణ్, ఎన్టీఆర్ కలసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాట బాగా హిట్ అయింది. త్వరలో మూడో పాట కూడా విడుదలవుతుందని తెలిపారు దర్శక నిర్మాతలు. దర్శకుడు రాజమౌళి ఈ సినిమాని జనవరి 7న విడుదల చేయాలనుకుంటున్నారు. అజయ్ దేవగణ్ మరో కీలక పాత్రలో నటించాడు. కీరవాణి స్వరాలందించారు.

    రామ్ చరణ్ కు, ఎన్టీఆర్ కు పునీత్ రాజ్ కుమార్ మంచి స్నేహితుడు. ఇప్పుడు వారిద్దరు కలసి నటించిన సినిమాలోని పాటకు పునీత్ రాజ్ కుమార్ స్టెప్పులు వేసినట్టు రూపొందించిన వీడియో.. బాగా వైరల్ అవుతోంది.

     

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.