మాజీ భార్య సమంతకు కౌంటర్ ఇచ్చిన నాగచైతన్య..

  0
  92301

  నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారం ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. చైతన్య, సమంత ఎవరికి వారే విడి విడిగా సినిమాలు చేసుకుంటున్నారు. విడాకుల వ్యవహారం తర్వాత సమంత మరింత హాట్ గా మారింది. ఓవైపు పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ పరమ భక్తురాలిగా మారిన సమంత, అదే సమయంలో సినిమాల్లో హాట్ హాట్ ఐటం సాంగ్ లు చేస్తూ, కవర్ పేజీలకోసం హాట్ హాట్ స్టిల్స్ ఇస్తూ అదరగొడుతోంది. ఈ క్రమంలో ఆమె పుష్ప సినిమా కోసం చేసిన పాట టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

  ఈ నేపథ్యంలో నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సమాధానం సమంత గురించే అన్నట్టుగా ఉంది. సినిమాల్లో మీరు ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడరు అనే ప్రశ్నకు నాగ చైతన్య సమాధానమిచ్చారు. ‘అన్ని రకాల పాత్రలు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. కానీ నేను పోషించే పాత్ర, సినిమా మా కుటుంబంపై ఎఫెక్ట్‌ చూపించకూడదు. మా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో చేయను’ అంటూ చై పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సమంతను ఉద్దేశించే పరోక్షంగా చై ఈ వ్యాఖ్యలు చేశారంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

  దీంతో ఫ్యామిలీ మెన్‌-2 వెబ్‌ సిరీస్‌లో సమంత బోల్డ్‌ యాక్టింగ్‌ వీరి విడాకులకు ప్రధాన కారణమనే రూమర్స్‌కి చై వ్యాఖ్యలతో మరింత బలం చేకూరిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

  ఇక విడాకుల అనంతరం సమంత వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం నాగ చైతన్య థ్యాంక్యూ, బంగార్రాజు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.