బిడ్డ ఏడుస్తోందని బావిలో వేసి చంపేసింది.

  0
  46

  ఇదేమి తల్లి.. ? కసాయి కన్నా ఘోరం . కన్నబిడ్డలమీద జంతువులకు ఉండే ప్రేమకూడా లేని రాక్షసి.. రెండునెలల బిడ్డ నిత్యం ఏడుస్తోందని బావిలో వేసి చంపేసింది పాతకి . దారుణమైన ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని బర్వాణి జిల్లా సంగ్వి గ్రామంలో జరిగింది. లలితాబాయి అనే మహిళకు ముగ్గురు పిల్లలు. మూడో బిడ్డ మగబిడ్డ.. రెండు నెలలముందే ప్రసవించింది. బిడ్డ ఆపకుండా ఏడుస్తున్నాడని , రాత్రిళ్ళు నిద్రపోనీయడంలేదని చెబుతుండేది.

  సోమవారం రోజు తెల్లవారుజామున 4 గంటలకు లేచి, బిడ్డని తీసుకొని , రెండుకిలోమీటర్ల దూరంలోని పొలాల్లోని పాడుపడ్డ బావిలో పడేసివచ్చింది. బిడ్డను ఎవరో ఎత్తుకెళ్లారని అబద్దం చెప్పింది. అయితే ఆమె బిడ్డను తీసుకుపోతుండగా చూసినవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాపిష్టి తల్లిని అరెస్ట్ చేసి , బావిలోనుంచి బిడ్డ శవాన్ని వెలికితీశారు..

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు