పురిటి బిడ్డను రెస్టారెంట్ లో వదిలి..

  0
  106

  14 ఏళ్ళ ఓ మైన‌ర్ బాలిక బిడ్డ‌ను కనింది. మ‌రో మైన‌ర్ బాలుడితో డేటింగ్ కార‌ణంగా బిడ్డ‌ను ప్ర‌స‌వించింది. బిడ్డ‌కు బొడ్డు పేగు కూడా తీయ‌కుండానే పురిటి పొత్తిళ్ళ‌లో పెట్టుకుని నేరుగా ఓ రెస్టారెంట్ కి వ‌చ్చింది. అక్క‌డే ఓ టేబుల్ ముందున్న యువ‌తి చేతిలో బిడ్డ‌ను పెట్టి, వాష్ రూమ్ కి వెళ్ళొస్తాన‌ని చెప్పి, అటు నుంచి అటే జారుకుంది. ఆ మైన‌ర్ బాలిక ఎంత సేప‌టికీ తిరిగి రాక‌పోవ‌డంతో, చివ‌రికి ఆ యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. న్యూజెర్సీ న‌గ‌రంలోని లిండేన్ అవెన్యూలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. సీసీ కెమెరాలో ఆ యువ‌తిని గ‌మ‌నించిన పోలీసులు ఆమెను వెతికి ప‌ట్టుకున్నారు.

  త‌న‌కు బిడ్డ వ‌ద్ద‌ని చైల్డ్ రెస్క్యూ హోంలో వ‌దిలేయాల‌ని చెప్పింది. విచిత్ర‌మేమిటంటే న్యూజెర్సీ చ‌ట్టాల ప్ర‌కారం 30 ఏళ్ళ‌లోపు బిడ్డ‌ను క‌న్న ఏ త‌ల్లి అయినా బిడ్డ‌ను ఆస్ప‌త్రి, పోలీస్ స్టేష‌న్, ఫైర్ స్టేష‌న్ లేదా ఏదైనా రెస్క్యూ సెంట‌ర్ల‌లో వ‌దిలిపెట్టి వెళ్ళిపోయే వెసులుబాటు ఉంది. బిడ్డ‌ను ఎందుకు వ‌దిలిపెడుతున్నావ‌ని అడిగే హ‌క్కు కూడా ఎవ‌రికీ లేదు. ఆ చ‌ట్టాల ప్ర‌కారం అలా వ‌దిలి వెళ్ళిన బిడ్డ‌ల‌ను రెస్క్యూ సెంట‌ర్ల‌కు త‌ర‌లిస్తారు. అందుకే అక్ర‌మంగా సంతానం క‌న‌డం, బిడ్డ‌ల‌ను వ‌దిలి వెళ్ళ‌డం.. న్యూజెర్సీలో త‌ర‌చుగా జ‌రుగుతుంటుంది. నాగ‌రిక‌త వికృత‌రూపానికి ఇదొక నిద‌ర్శ‌నం.

   

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు