పిల్లలను బైక్ మీద అలా తీసుకెళ్తే కేసు..

    0
    623

    నాలుగేళ్ళ పిల్ల‌ల‌ను బైక్ లో తీసుకెళ్ళాలంటే ఖ‌చ్చితంగా కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల్సిందే. ఈ మేర‌కు కేంద్ర రోడ్డు ర‌వాణా, జాతీయ ర‌హ‌దారుల శాఖ ప్ర‌తిపాద‌న‌లు రూపొందించింది. బైక్ మీద పిల్ల‌ల‌ను తీసుకెళ్ళాలంటే గంట‌కు గ‌రిష్ట వేగం 40 కి.మీ మించ‌రాదు. ఖ‌చ్చితంగా పిల్ల‌ల‌కి కూడా క్రాష్ హెల్మెంట్ ఉండాల్సిందే. డ్రైవింగ్ చేసే వ్య‌క్తి, ఆ చిన్నారిని సేఫ్టీ బ్యాగ్ లో కూర్చోబెట్టుకుని తన వీపునకు తగిలించుకోవాల్సి ఉంటుంది. ఆ బ్యాగ్ కూడా నైలాన్ తో త‌యారు చేసిన‌దై ఉండాలి.

    30 కిలోల బ‌రువును మోయ‌గలిగేదిగా ఆ సేఫ్టీ బ్యాగ్‌ ఉండాలి. వ‌ర్షానికి త‌డ‌వ‌కుండా, ధృడంగా, తేలిక‌గా ఉండాలి. ఇలాంటి ప్ర‌తిపాద‌న‌లు తెర‌పైకి తెచ్చింది కేంద్రం. దీనిపై అభ్యంత‌రాలు, స‌ల‌హాలు, సూచ‌న‌లు తెలియ‌జేయాల‌ని కోరింది.

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..