మమతకోసం ఎమ్మెల్యే రాజీనామా..

  0
  28

  పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోసం భవానీపూర్ ఎమ్మెల్యే సోభాందేవ్‌ ఛటోపాధ్యాయ రాజీనామా రాశారు. స్పీకర్‌ కు రాజీనామా పంపడం, ఆయన ఆమోదం తెలపడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ స్థానం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ సువేందు అధికారి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే అధికార పార్టీ నాయకురాలిగా ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

  అయితే 6 నెలల లోపల ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. ఎన్నికలు వాయిదా పడిన నియోజకవర్గాలు ఉన్నా కూడా సీఎం మమతకోసం, భవానీపూర్ ఎమ్మెల్యే రాజీనామా చేయడం విశేషం. గతంలో రెండుసార్లు ఇదే నియోజకవర్గంనుంచి మమత ఎమ్మెల్యేగా గెలిచారు. సువేందు బీజేపీలోకి వెళ్లడంతో ఆమె.. నందిగ్రామ్ ని ఎంపిక చేసుకుని ఓడిపోయారు. తాజాగా ఆమె తన సొంత నియోజకవర్గంనుంచే పోటీ చేయడానికి సిద్ధపడ్డారు.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు