మెక్సికో అందానికి మిస్ యూనివర్స్ కిరీటం..

  0
  41

  మిస్‌ యూనివర్స్ -2020 గా మెక్సికో అందగత్తె ఆండ్రియా మేజా ఎంపికయ్యారు. మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్న మూడో మెక్సికన్ యువతి ఆండ్రియా. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆండ్రియా మోడలింగ్ రంగంలో అడుగు పెట్టింది. 73 మందిని దాటుకొని ఈ టైటిల్ కైవసం చేసుకుంది.

  69వ మిస్‌ యూనివర్స్ పోటీలు ఫ్లొరిడాలోని సెమినోలే హార్డ్ రాక్ హాలీవుడ్ హోటల్‌లో జరిగాయి. మనం ప్రవర్తించే విధానంలో కూడా అందం ఉంటుందని, మిమ్మల్ని ఎవరు తక్కువగా చూసినా ఒప్పుకోవద్దంటూ.. తుది దశలో ఆమె చెప్పిన సమాధానం న్యాయనిర్ణేతలను మెప్పించింది.

  https://www.instagram.com/andreamezamx/?utm_source=ig_embed&ig_rid=78020f1b-bb17-47f2-9ad3-1e6dce3b94bd

  దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ విశ్వసుందరి జొజిబిని తుంజి ఆమెకు కిరీటాన్ని పెట్టారు. కరోనా కారణంగా విశ్వసుందరి పోటీలను గతేడాది నిర్వహించలేదు. మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన అడిలైన్ క్యాస్టిలినో.. మూడో రన్నరప్‌గా నిలిచారు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.