అందాల శ్రీమతి శ్రీలంక కిరీటం జారిందిలా..

  0
  123

  శ్రీమతి శ్రీలంక కిరీటం జారిందిలా..
  అందాల సుందరాంగుల పోటీలో మిసెస్ శ్రీలంకగా ప్రకటించి కిరీటం పెట్టిన యువతికి క్షణాల్లో ఆ టైటిల్ రద్దు చేసి కిరీటం తీసేశారు. దీంతో వేదికమీదే మిసెస్ టైటిల్ ని మిస్సైన పుష్పిక డిసిల్వాకు జ్యూరీ సభ్యులకు మధ్య వాదన జరిగింది. ఎలాగైతేనే ఆ టైటిల్ తీసేయడంతో, ఆమె ఏడుస్తూ వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. ఇంతకీ దీనికి కారణం మిసెస్ శ్రీలంకగా ఎన్నికైన పుష్పిక, పెళ్లైన తర్వాత భర్తకు విడాకులిచ్చేసిందని, అందు వల్ల విడాకులు ఇచ్చినవారు మిసెస్ శ్రీలంక పోటీకి అర్హులు కారని, మరో అందాల సుందరి అభ్యంతరం చెప్పడంతో వెంటనే ఆమె కిరీటం తీసివేసి, రన్నరప్ ని మిసెస్ శ్రీలంకగా ప్రకటించారు. క్షణాల్లో అందాల కిరీటం జారిపోవడంతో ఆమె తగాదా పెట్టుకుని ఏడుస్తూ వెనక్కి వెళ్లిపోయింది. తాను భర్తకు విడాకులు ఇవ్వలేదని, వదిలేసి విడిగా ఉంటున్నానని, అలాంటప్పుడు విడాకుల సాకుతో తన కిరీటం తీసేయడం అన్యాయం అంటూ పుష్పిక ఆవేదన వ్యక్తం చేసింది.

   

   

  ఇవీ చదవండి

  ఆమె వేధింపులతో యువకుడు ఆత్మహత్య..

  నూటికో, కోటికో ఇలాంటి డాక్టర్లు ఉండబట్టే..

  మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

  సినిమాలో సీన్ కాదు.. కాశీలో పుర్రెల మాలతో అఘోరాల హోలీ సంబరాలు