ఆ నదిలో పాలు ఎందుకు ప్రవహించాయంటే.. ?

  0
  1491

  ఆ నదిలో.. పాలు ఎందుకు ప్రవహించాయంటే.. ?
  ==================================
  నీళ్లు లేక ఎండిపోయిన నదిలో గంట ముందు వరకూ రాళ్లు కనిపించాయి. గంట తర్వాత చూస్తే నదిలో మాత్రం పాల వరద కనిపించింది. నదిలో నీళ్లు పారాలి గానీ.. పాలు పారడం ఏమిటని స్థానికులకు అనుమానం వచ్చింది. దీన్ని కంటితో చూడనివారికి నమ్మే అవకాశం లేదు. కొంతమంది వీడియో తీశారు కాబట్టి నమ్మక తప్పని పరిస్థితి. ఇంతకీ ఆ నదిలో నీళ్ల బదులు పాలు ఎందుకు ప్రవహిస్తున్నాయోనని ఆరా తీస్తే.. నదికి ఎగువ భాగాన ఒక భారీ పాల ట్యాంకర్ బోల్తా పడింది. ఈ పాల ట్యాంకర్లో 28 వేల లీటర్ల పాలు ఉన్నాయి. ఆ మొత్తం పాలు నదిలో ప్రవహిస్తూ.. అందరినీ ఆశ్చర్యానికిగురి చేసింది. ఈ ఘటన బ్రిటన్ లోని వేల్స్ నగరంలోని దులైస్ నదిలో జరిగింది.

   

   

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.