మిలట్రీ ఆఫీసర్ ని చితకబాదిన పెళ్లాం..

  0
  140

  దేశ సరిహద్దుల్లో బాంబు దాడులు, తీవ్రవాదుల కాల్పులను సమర్థంగా ఎదుర్కొంటూ, శత్రువులకు సింహ స్వప్నంలా మారిన ఓ మిలట్రీ లెఫ్ట్ నెంట్ కల్నల్ తన భార్య వేధింపులనుంచి తనను కాపాడాలంటూ పోలీసు కేసు పెట్టాడు. ప్రతిరోజూ తన భార్య గోల్ఫ్ కర్రతో తనను కొడుతుందని, ఏరోజైనా తనను చంపేసే ప్రమాదం ఉందంటూ రమణ్ దీప్ సింగ్ అనే మిలట్రీ అధికారి, ఢిల్లీ కంటోన్మెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విలాసవంతమైన కారు కొనాలని తన భార్య మహాజన్ తనను పోడు చేస్తోందని, డబ్బుల్లేవని చెబితే గోల్ఫ్ స్టిక్ తీసుకుని కొడుతోందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు మేరకు, పోలీసులు ఆ మిలట్రీ అధికారిని ఆస్పత్రికి పంపించారు. గోల్ఫ్ కర్రతో కొట్టిన దెబ్బలు ఉన్నాయని తేలింది. ఆయన కుడిచేయి కూడా అందుకే విరిగిపోయిందని, తలపై కూడా దెబ్బలు తగిలాయని డాక్టర్లు నిర్థారించారు. దీంతో ఆమెపై మెడికో లీగల్ కేసు నమోదు చేశారు. కేసు విచారణలో ఉందని, ఇద్దర్నీ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. గతంలో కూడా తనపై ఇలాగే దాడి చేసేదని, దానికి వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయని పోలీసులకు చూపించాడు రమణ్ దీప్ సింగ్. పిల్లల్ని తీసుకుని వెళ్లిపోయి, ఇప్పుడు తనను చంపేస్తానంటూ బెదిరిస్తోందని వాపోయాడు. కల్నల్ భార్య మహాజన్ ఆర్కిటెక్చర్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తోంది.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు