ఆమె కడుపుతో ఉందని ఆమెకే తెలియదు..

  0
  692

  వైద్య శాస్త్రానికి అందని అద్భుతాలు ఇప్పటికీ జరుగుతుంటాయి.. వాటికి సమాదానాలు ఉండవు. ఎందుకంటే అవి అద్భుతాలు.. ఇదిగో లీవియా అనే 23 ఏళ్ళ మహిళ ,తాను గర్భంతో ఉన్నానన్న విషయం తెలియకుండానే , ఆడబిడ్డను కనేసింది. ఆమెకు యధాప్రకారం పీరియడ్స్ వస్తూనే ఉన్నాయి.. గర్భం దాల్చిన తరువాత పీరియడ్స్ ఆగిపోవాలసిందే.. అయితే లీవియా విషయంలో అలా జరగలేదు.. రెండు దఫాలు పీరియడ్స్ లేట్ అయితే , స్ట్రిప్ టెస్ట్ చేసుకుంటే , నెగెటివ్ వచ్చింది. దీంతో ఆమె మామూలుగానే ఉండిపోయింది. ఇటీవల , ఒక క్లబ్ లో ఫ్రెండ్స్ తో డ్రింక్ పార్టీలో ఉండగా , వంట్లో కొంచెం నలతగా ఉండింది.. ఇంటికెళితే కడుపునొప్పి మొదలైంది.. దీంతో ఫుడ్ పాయిజన్ అనుకోని హాస్పిటల్ కి వెల్లింది.. అక్కడ చెక్ చేసి , కాన్పు కాబోతుందని చెప్పారు.. అయితే ఆమె నమ్మలేదు.. డాక్టర్లు ఆమెకు 8 వ నెల దాటి , 15 రోజులు అయిందనికూడా చెప్పారు.. అయితే తనకు పీరియడ్స్ ఆగలేదని , తాను గర్భంతో ఉన్నట్టు తానెప్పుడూ అనుకోలేదని లీవియా చెప్పింది. డాక్టర్లు ఆమెకు గంటలో ఆపరేషన్ చేసి ,బిడ్డను కాన్పు చేశారు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్