మారుతి కార్ల కంపెనీలు మూసివేత..

  0
  799

  మారుతి సుజుకి కార్ల కంపెనీ దేశ‌వ్యాప్తంగా త‌మ కార్ల ఫ్యాక్ట‌రీల‌ను మూసివేసింది. కార్ల త‌యారీకి అవ‌స‌ర‌మైన ఆక్సీజ‌న్ అందుబాటులో లేక‌పోవ‌డం, ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా ప‌రిస్థితుల దృష్ట్యా, ఆక్సీజ‌న్ ను త‌మ కంపెనీల‌కు వాడుకోవ‌డం స‌మంజ‌సం కాద‌న్న ఉద్దేశ్యంతో మే1వ తేదీ నుంచి 9వ తేదీ వ‌ర‌కు ఫ్యాక్ట‌రీల‌ను మూసి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో 9 రోజుల పాటు కార్ల ఉత్ప‌త్తి నిలిచిపోనుంది. రోజుకి మూడు ల‌క్ష‌ల మంది క‌రోనా రోగుల‌కి ఆక్సీజ‌న్ అవ‌స‌ర‌మ‌వుతోంది. రోజుకీ ఆక్సీజ‌న్ కొర‌త‌తో 3వేల మంది చ‌నిపోతున్నారు. వీటిలో ఆక్సీజ‌న్ కొర‌త కార‌ణంగా 70 శాతం మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర‌కారం కేంద్ర హోంశాఖ కూడా పారిశ్రామిక అవ‌స‌రాల‌కు ఆక్సీజ‌న్ వినియోగాన్ని నిషేధించింది. దేశంలో స్టీల్ ప్లాంట్ ల‌లో కూడా ఆక్సీజ‌న్ వినియోగాన్ని నిలిపివేసి, అక్క‌డ త‌యార‌య్యే ఆక్సీజ‌న్ ను ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో మారుతి కంపెనీ కూడా దేశంలోని త‌మ యూనిట్ల‌ను, ఫ్యాక్ట‌రీల‌ను కొంత‌కాలం మూసివేయాల‌ని నిర్ణ‌యించుకుంది.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.