పెళ్లైన రెండోరోజే మొదటి భర్తను పిలిచింది..

  0
  2494

  పెళ్లి పేరుతో అమ్మాయిలు చేసే మోసాలు.. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మరీ ఎక్కువైపోయాయి. అమ్మాయిలు దొరకని అబ్బాయిలు ఈ మోసాల వలకు చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా ఓ భర్త తన భార్యను, తన సోదరి అని చెప్పి మధ్యవర్తి ద్వారా సంబంధం కుదిర్చి లక్షా 80వేలు తీసుకుని వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇద్దరు పిల్లలున్న కోమల్ అనే మహిళ పెళ్లై ఇంటికొచ్చిన తర్వాత అసలు విషయం చెప్పేసింది. దీంతో భర్త రవి లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ కి పరిగెత్తాడు. మధ్యప్రదేశ్ లోని కోట ప్రాంతానికి చెందిన రవికి చాలా కాలంగా పెళ్లి కాకపోవడంతో దేవరాజ్ అనే మధ్యవర్తిని ఆశ్రయించాడు. దేవరాజ్ తనకో మంచి అమ్మాయి తెలుసంటూ కోమలిని చూపించి పెళ్లి చేశాడు. పెళ్లి తర్వాత తన సోదరుడ్ని ఇంటికి పిలిపిస్తానంటూ సోనుని పిలిపించింది. సోను వచ్చి కోమల్ తన భార్య అని తమకి ఇద్దరు పిల్లలున్నారని, ఆమెను తీసుకెళ్తానని చెప్పడంతో రవి మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..