కరోనా దెబ్బ.. విమానంలో వివాహం..

  0
  60

  భూమిమీద అయితే కరోనా ఆంక్షలు.. ఆకాశంలో అయితే.. ? అదే ఆకాశంలో అయితే.. ?? ఉన్నోడు ఎక్కడైనా పెళ్ళిచేస్తాడు..ఈ పెళ్లి విచిత్రం చూడండి.. మదురైలో ఓ జంట చార్ట్ ర్డ్ విమానంలో పెళ్లిచేసుకుంది. మధురైకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తల బిడ్డల పెళ్లి ఇలా ఘనంగా చేశారు. భూమిమీద పెళ్ళిఅంటే 30 మందికంటే మించకూడదని నిబంధన ఉంది.. అందుకే ఒక విమానం అద్దెకు తీసుకున్నారు. 165 మంది బంధుమిత్రులంతా కరోనా పరీక్షలు చేసుకొని విమానం ఎక్కారు.. విమానం ఎగిరిన తరువాత ముహూర్తం ప్రకారం వధువు దక్షిణ మెడలో వరుడు రాకేష్‌ తాళి కట్టాడు . అందరూ అక్షింతలు వేశారు.. విమానంలోనే పురోహితుడుకూడా ఉన్నాడు.. విమానం మదురైనుంచి , తూతుకూడి , అక్కడనుంచి మధురైకి వచ్చేసింది.. గాల్లో పెళ్లి అయిపోయింది..

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు