అమెజాన్ లో కత్తి కొన్నాడు.. ఆ తర్వాత..

  0
  155

  అమెజాన్ లో కత్తి రూ.1500 పెట్టి కత్తి ఆర్డర్ ఇచ్చాడు. కత్తి ఇంటికొచ్చాక దాన్ని తీసుకుని లవర్ ఇంటికెళ్లాడు. అయితే అతను అనుకున్న పని పూర్తి చేసే లోగా పోలీసులు వచ్చి అతడ్ని పట్టుకున్నారు. లవర్ సోదరి చాకచక్యంతో ఈ వ్యవహారం బయటపడింది.

  బోరబండ సమీపంలోని బంజారా నగర్‌ వాసి బండారి శ్రీకాంత్‌(25), ఓ హోటల్ జిమ్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేసే యువతిని ప్రేమించాడు. మూడేళ్లు ప్రేమ వ్యవహారం బాగానే సాగింది. ఆ తర్వాత అతని వ్యవహారం నచ్చక యువతి దూరం పెట్టింది. ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో 2020 అక్టోబరులో యువతి ఫిర్యాదుతో మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో శ్రీకాంత్‌ పై కేసు నమోదైంది. ఇటీవల ఆ యువతితో కలసి మాట్లాడాలని శ్రీకాంత్ టార్చర్ పెడుతున్నాడు. ఈ క్రమంలో మాట్లాడేందుకు యువతి పర్మిషన్ ఇవ్వడంతో అర్థరాత్రి 12గంటలకు ఆమె రూమ్ కి చేరుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లో యువతి, ఆమె సోదరి ఉన్నారు. కూర్చొని మాట్లాడుతుండగా అతని వెనుక భాగంలో కత్తి ఉన్నట్లు యువతి సోదరి గుర్తించింది. తన సోదరిని పిలిచి గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకోవాలని సూచించింది. దీంతో యువతి గదిలోకి వెళ్లి రాత్రి 12.53 గంటలకు 100కు సమాచారం అందించింది. ఈలోపు యువతి సోదరి అతన్ని మాటల్లో పెట్టింది. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీస్ సిబ్బంది వెంటనే యువతి ఇంటికి చేరుకున్నారు. యువకుడిని తనిఖీ చేయగా జాంబియా(కత్తి) లభించింది. శ్రీకాంత్‌ను జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆ ఈ కత్తిని అమెజాన్‌లో రూ. 1500కు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.