అద్దె పేరుతో 130 కార్లు హాం ఫట్..

  0
  1114

  వీడెవడో మహా మాయగాడు. బహుశా ఇండియాలో, విదేశాల్లో కూడా ఇలాంటి మోసగాళ్లను చూసి ఉండరు. ట్రావెల్స్ వ్యాపారం పేరుతో 130 కార్లను అద్దెకు తీసుకుని ఓ మంచి మహూర్తం చూసుకుని కార్లు తీసుకుని పరారయ్యాడు. ఇదొక అసాధారణమైన చీటింగ్. కర్నాటక బెంగళూరు సమీపంలోని నెలమంగళలో తమిళనాడుకి చెందిన శివకుమార్, ఏడాది క్రితం ఆర్.ఎస్ ట్రావెల్స్ పేరుతో వ్యాపారం మొదల పెట్టాడు. అందరితో నమ్మకంగా ఉంటూ స్నేహం చేశాడు. కారు ఓనర్లు తన దగ్గర కారు ఉంచితే అద్దెకు తిప్పి కమిషన్ తాను తీసుకుని డబ్బులిచ్చేస్తానని నమ్మించేవాడు. ఏడాదిగా ఇలా చేశాడు. దాదాపు 130 కార్లు తన అధీనంలో ఉంచుకున్నాడు. ప్రతి నెలా 8వతేదీ కార్ల యజమానులకు అద్దె డబ్బులు కూడా వేసేవాడు. దీంతో నమ్మకంగా ఉండటంతో తమ కార్లు ఎక్కడున్నా, ఎలా ఉన్నాయన్నది ఎవరూ పట్టించుకోలేదు. ఈనెల అద్దె డబ్బులు వేయకపోవడంతో ఫోన్ చేస్తే పనిచేయలేదు. దీంతో అనుమానం వచ్చి ట్రావెల్స్ ఆఫీస్ దగ్గరకు వస్తే తాళం వేసి ఉంది. కార్లు కూడా లేవు. కార్లన్నీ తమిళనాడుకి తరలించి అమ్మేసి ఉంటాడని బాధితులు లబోదిబోమంటున్నారు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.