కాఫీకప్పులో కెమెరా.. జిమ్ డ్రెస్ ఛేంజింగ్ రూమ్ లో.. అన్నీ ఆ ఫొటోలే..

  0
  535

  టెక్నాల‌జీ కొత్త‌పుంత‌లు తొక్కుతున్న నేటికాలంలో… ఆ టెక్నాల‌జీని దుర్వినియోగం చేసే పోకిరీలు లెక్క‌కు మించే ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిల‌ను టార్గెట్ చేసుకుని నీచ‌మైన ప‌నుల‌కు దిగుతున్నారు. ఓ దుర్మార్గుడు సీక్రెట్ కెమెరాతో వంద‌ల మంది మ‌హిళ‌లు, అమ్మాయిల అస‌భ్య‌క‌ర‌మైన వీడియోల‌ను చిత్రీక‌రించిన ఘ‌ట‌న వెలుగుచూసింది. అమెరికాలోని విస్కాన్సిన్ సిటీలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే…

  విస్కాన్సిన్ సిటీలోని ఓ జిమ్ లో ఓ వ్య‌క్తి,, జిమ్ చేసేందుకు వ‌చ్చిన మ‌హిళ‌లు, అమ్మాయిల ఫోటోలు, వీడియోలు సీక్రెట్ కెమెరాలో బంధించాడు. అదికూడా ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌కుండా ఉండేలా కాఫీ క‌ప్పుకి సెట్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఒక్క‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ఏకంగా 542 మంది లేడీస్ వీడియోలు తీశాడు. జిమ్ లో ఉండే లేడీస్‌ డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ త‌తంగం మొత్తం జ‌రిగింది. కొన్నేళ్ళుగా ఆ నీచుడు అమ్మాయిలు, మ‌హిళ‌లు డ్రెస్సింగ్ రూమ్ లో దుస్తులు మార్చుకుంటున్న అమ్మాయిల చిత్రాల‌ను చిత్రీక‌రించి పైశాచికానందం పొందుతున్నాడు.

  అయితే అథ్లెటిక్ క్ల‌బ్ సిబ్బందికి అనుమానం రావ‌డంతో ఆ కాఫీ క‌ప్పును ప‌రిశీలించ‌గా, సీక్రెట్ కెమెరా ఉంద‌ని గుర్తించారు. వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో నిందితుడిని అరెస్ట్ చేసి విచారించారు. అత‌ని వ‌ద్ద ఉండే కంప్యూట‌ర్ ను ప‌రిశీలించిన పోలీసుల‌కు దిమ్మ‌తిరిగిపోయింది. ఆ కంప్యూట‌ర్ లో వంద‌ల‌కొద్దీ అమ్మాయిల అస‌భ్య‌క‌ర‌మైన ఫోటోలు, వీడియోలు క‌నిపించాయి. అత‌న్ని విచారిస్తే… లేడీస్ జిమ్ చేయ‌క‌ముందు ఎలా ఉంటారు ? చేసిన త‌ర్వాత ఎలా ఉంటారు ? అని తెలుసుకోవాల‌నే ఉత్సాహంతో ఈ ప‌ని చేశాన‌ని చెప్పుకొచ్చాడు.

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..